ఒక టాలీవుడ్ హీరో, ఫ్యామిలీ సినిమాలతో పాపులర్ అయ్యాడు, పెద్దగా ఆస్తులు కూడా సంపాదించలేదు. కానీ సైనికుల త్యాగాలను గుర్తించాడు. దాదాపు 170 ఎకరాల భూమిని ఇచ్చేశాడు. ఇంతకీ ఎవరా హీరో? ఆయన నిర్ణయం వెనుక కారణం ఏంటి?
ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఉన్నారు. కానీ సాయం చేసే మంచి మనసు అందరికి ఉండాలి కదా. టాలీవుడ్ లో చాలామంది హీరోలు సమాజ సేవ కోసం అంతో ఇంతా ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. స్టార్ డమ్ ఉన్నా లేకున్న, ఆస్తులు ఉన్నా లేకున్నా తమకు తోచిన సాయం చేయడంతో ముందున్నారు తెలుగు హీరోలు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, బాలయ్య క్యాన్సర్ హాస్పిటల్, వరదలు వస్తే తెలుగు హీరోలు స్పందించే తీరు అందరికి తెలిసిందే. అయితే కొంత మంది హీరోలు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా గుప్త దానాలు చేస్తుంటారు. అలానే ఓ టాలీవుడ్ హీరో పెద్దగా ఆస్తులు లేకపోయినా.. సైనికుల కోసం ఏకంగా వందల కోట్ల విలువ చేసే 170 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు సుమన్.
25
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో
టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా సుమన్ కు మంచి పేరుంది. ఒక టైమ్ లో చిరంజీవికి కూడా పోటీ ఇస్తూ.. వరుస విజయాలు సాధించాడు సీనియర్ హీరో. మంచి మంచి కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుని మరీ సినిమాలు చేసేవారు సుమన్. దాదాపు స్టార్ హీరోయిన్లందరూ సుమన్ తో నటించినవారే. కానీ సుమన్ కు సబంధంలేని కొన్ని వివాదాలు ఆయన కెరీర్ ను దెబ్బతీశాయి. ఇండస్ట్రీలో కొందరు కావాలనే సుమన్ ను తొక్కేశారని, పైకి ఎదగకుండా చేశారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తూనే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సుమన్ మెగాస్టార్ రేంజ్ లో ఉండేవారని అంటుంటారు. అయితే హీరోగా కెరీర్ ముగిసిన తరువాత సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ డమ్ చూశారు. వరుస సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు.
35
సైనికుల కోసం 170 ఎకరాలు
వరదలు వచ్చినా, ఇతర విపత్తులు వచ్చినా.. హీరోలు సాయం చేయడం కామన్. వారు వారికి తోచిన సాయం చేస్తుంటారు. అయితే సుమన్ మాత్రం పెద్దగా ఆస్తులు లేకపోయినా.. సైనికుల కోసం తన దగ్గర ఉన్న కోట్ల విలువైన భూమిని రాసిచ్చేశాడు. హైదరాబాద్ కు దగ్గరలో, భువనగిరి ప్రాంతంలో ఉన్న 170 ఎకరాల భూమిని, కార్గిల్ యుద్దంలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఇచ్చేశాడు సుమన్. ఈ విషయం చాలా కాలంగా ఎవరికీ తెలియదు. అది కూడా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తే తప్పించి, సుమన్ తానంతట తాను ఈ విషయాన్ని చెప్పలేదు. ఇలాంటి గుప్త దానాలు ఎన్నో చేశారు టాలీవుడ్ హీరో, కానీ వాటిని బయటకు చెప్పుకోడం ఇష్టం ఉండదని అంటారు.
సుమన్ కార్గిల్ యుద్దంలో మరణించినవారికి ఇచ్చిన ఆ 170 ఎకరాల భూమి తాను స్టూడియో కట్టుకోవడం కోసం కొన్నారు. అక్కడ ఓ పెన్ స్టూడియో కట్టుకుని, కమర్షియల్ గా వాడుకోవచ్చు అని అనుకున్నారట సుమన్. అయితే అదే టైమ్ లో కార్గిల్ వార్ జరగడం, సైనికుల కుటుంబాలకు ఏదో ఒకటి చేయాలి అని సుమన్ భార్య సలహా ఇచ్చారట. ఈ భూమిని వారికి ఇవ్వాలి అన్న ఐడియా కూడా తన భార్య ఇచ్చినదే అని సుమన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చాలా మంచి ఆలోచన, మంచి పని కాబట్టి ఎక్కువగా ఆలోచంచలేదని, వెంటనే ఆ భూమి వారికి ఇచ్చేశానన్నారు సుమన్.
55
సుమన్ భార్య ఎవరో తెలుసా?
ఒకప్పటి రచయిత, దర్శకుడు డివి నరసరాజు ఎన్నో అద్భుతమైన సినిమాలకు పనిచేశారు. దర్శకుడిగా కంటే ఆయన రచయితగానే ఎక్కువ గుర్తింపు పొందారు. అప్పట్లో యుగంధర్, యమగోల, గుండమ్మ కథ, రంగులరాట్నం, రాజమకుటం, రాముడు భీముడు లాంటి సినిమాలకు నరసరాజు రచయితగా పనిచేశారు. నరసరాజు మనవరాలినే సుమన్ వివాహం చేసుకున్నారు. సుమన్ భార్య పేరు శిరీష తల్వార్. ఆమె నరసరాజు కుమార్తె కవిత కూతురు. సుమన్ తో ఓ సినిమా నిర్మించాలి అనుకున్నారు కవిత. ఆ సినిమా కోసం చర్చలు కొనసాగుతున్న టైమ్ లో, సుమన్ వ్యక్తిత్వం నచ్చి, కవిత తన కూతురిని సుమన్ కు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ వారు అనుకున్న సినిమా మాత్రం చేయలేదు. సినిమాకోసం వెళ్తే ఇంటల్లుడిని చేసుకున్నారని సుమన్ ఇంటర్వ్యూలలో సరదాగా చెపుతుంటారు.