బిగ్ బాస్ షోలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో దూసుకుపోతున్న ఇమ్మాన్యుయేల్ మరో ఘనత సాధించాడు. రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నారు. బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో మరిన్ని హైలైట్స్ ఈ కథనంలో తెలుసుకోండి.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా మారుతోంది. వీకెండ్ కావడంతో శనివారం రోజు ఎపిసోడ్ కి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం ఇంటి సభ్యుల పెర్ఫార్మెన్స్ ని నాగ్ రివ్యూ చేశారు. శ్రీజపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీజ ప్రతి గేమ్ లో టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. కానీ అనవసరంగా నోరు పారేసుకుంటోంది. కానీ మాట్లాడాల్సిన చోట మాత్రం నోరు తెరవడం లేదు అని అన్నారు.
25
ఆడే వాళ్ళని చెడగొడుతున్న రీతూ
శ్రీజ, రీతూ చౌదరి మధ్య ఉన్న వివాదాన్ని నాగార్జున లేవనెత్తారు. పవన్ తనకి సపోర్ట్ చేయడం రీతూకి ఇష్టం లేదని.. అందుకే తనని టార్గెట్ చేస్తోంది అని శ్రీజ పేర్కొంది. నాగార్జున రీతూ చౌదరిపై సెటైర్లు వేశారు. రీతూ చౌదరి గేమ్ బాగా ఆడే వాళ్ళని కూడా చెడగొడుతోంది. టాస్క్ లలో సొంత తెలివితేటలు ప్రదర్శించి అంతా చెడగొడుతోంది అని అన్నారు. ఆ తర్వాత నాగార్జున కీలకమైన దశని ప్రారంభించారు.
35
గోల్డెన్ స్టార్స్ గా ఆరుగురు
గోల్డెన్ స్టార్స్ దక్కించుకున్న వారందరిని ముందుకి పిలిచారు. ఇమ్మాన్యుయేల్, రాము, కళ్యాణ్, తనూజ, దివ్య, భరణి లకు గోల్డెన్ స్టార్స్ లభించాయి. వీరందరికి పవర్ అస్త్ర పోటీ జరిగింది. నాగార్జున ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ముందుగా తనూజ వెళ్ళింది. గోల్డెన్ స్టార్స్ ఒక్కొక్కరి ఫోటో వద్ద ఒక్కో కీ ఉంటుంది. పవర్ అస్త్ర పొందేందుకు ఎవరు అర్హులు కాదని భావిస్తే వారి కీని బ్రేక్ చేయాలి అని నాగార్జున తెలిపారు. దీనితో తనూజ.. రాము కీని బ్రేక్ చేసింది. రాముకి ఏ విషయంలో కూడా సరైన స్టాండ్ ఉండదని తనూజ పేర్కొంది.
ఆ తర్వాత దివ్య వెళ్ళింది. దివ్య.. కళ్యాణ్ కీని విరిచేసింది. టాస్క్ లలో కళ్యాణ్ సరిగ్గా బ్రెయిన్ ఉపయోగించడు. అందుకే అతడికి పవర్ అస్త్ర ఉపయోగించే అర్హత లేదని దివ్య పేర్కొంది. ఆ తర్వాత భరణి వంతు వచ్చింది. భరణి.. తనూజ కీని విరిచేశారు. తనూజ చాలా ఎమోషనల్ అని అందుకే ఆమెకి అర్హత లేదని భరణి అన్నారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్.. దివ్య కీని బ్రేక్ చేశారు. చివరికి భరణి, ఇమ్మాన్యుయేల్ కీలు మాత్రమే మిగిలాయి.
55
పవర్ అస్త్ర గెలుచుకున్న ఇమ్మాన్యుయేల్
కళ్యాణ్.. భరణి కీని బ్రేక్ చేశాడు. ఆయన హౌస్ లో చాలా ఎమోషన్స్ లో చిక్కుకుపోయారు అని కళ్యాణ్ అన్నారు. ఇక మిగిలింది ఇమ్మాన్యుయేల్ కీ మాత్రమే కాబట్టి అతడికి పవర్ అస్త్ర దక్కింది అని నాగార్జున ప్రకటించారు. ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర అందుకున్నారు. దానిని ఎప్పుడు ఎలా వాడాలి, ఎలాంటి పవర్స్ వస్తాయి అనేది బిగ్ బాస్ చెబుతారు అని నాగ్ తెలిపారు. ఇక మిగిలిన బ్లాక్ స్టార్స్ లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నట్లు నాగార్జున బాంబు పేల్చారు.