నా దర్శకులు, నిర్మాతలు నన్ను రిపీట్ చేశారు. నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఆ విధంగా దర్శకులు కానీ నిర్మాతలు కానీ మళ్ళీ నా దగ్గరకి వచ్చేవారు కాదు. చాలా మంది దర్శకులు నిర్మాతలతో నేను 5 లేదా 6 చిత్రాలు చేశాను. ఇక హీరోయిన్లతో కూడా నాకు ఎలాంటి విభేదాలు ఉండేవి కావు. నాతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు అంటే విజయశాంతి, భానుప్రియ అని చెప్పొచ్చు.