మరో వ్యక్తితో కనిపించిన యాంకర్ సుమ, నాన్నకి చెబుతా అంటూ కొడుకు వార్నింగ్.. కత్తి తీసుకుని..

Published : Jan 08, 2026, 11:54 AM IST

యాంకర్ సుమ తన కొడుకు రోషన్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. చిన్నతనంలోనే రోషన్ కనకాల తనకి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని సుమ గుర్తు చేసుకున్నారు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
హీరోయిన్ కెరీర్ ప్రారంభించిన సుమ 

 ప్రముఖ యాంకర్ సుమ 90 వ దశకంలోనే నటిగా కెరీర్ ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్ లో అనేక కార్యక్రమాలు చేశారు. మలయాళంలో హీరోయిన్ గా కూడా నటించారు. కానీ యాక్టింగ్ ప్రొఫెషన్ ఆమెకి అంతగా నచ్చలేదట. నటనలో ఫ్రీడమ్ ఉండేది కాదు అని సుమ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాక్టింగ్ నా బాడీ లాంగ్వేజ్ కి సరిపడదు అని మానేశాను. అదే సమయంలో ఈటీవీ, జెమిని లాంటి ఛానల్స్ ప్రారంభం అయ్యాయి. దీనితో యాంకర్ గా నాకు అవకాశాలు మొదలయ్యాయి. 

25
కొడుకు గురించి చెప్పిన సుమ 

ఆ టైంలో కూడా అక్కగా, చెల్లిగా నటించాను. టీవీ సీరియల్స్ కూడా చేశాను. ఆ సమయంలోనే రాజీవ్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నేను సినిమాల్లో నటించడం రాజీవ్ కి ఇష్టం లేదు. అందుకే టీవీ సీరియల్స్ లో నటించాను. మాకు అబ్బాయి రోషన్ పుట్టాడు. వాడికి నన్ను వేరే వ్యక్తులతో చూడడం ఇష్టం లేదు. 

35
రోషన్ ఏం చేశాడో తెలుసా ?

ఒకసారి ఈవెంట్ లో ఓ వ్యక్తితో మాట్లాడుతున్నాను. మా అబ్బాయి వచ్చి ఎవరు అతను.. నాన్నతో చెప్పేస్తాను అని వార్నింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. మేల్ డామినేషన్ అనేది చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఒకసారి టీవీలో వేరే వ్యక్తితో కనిపిస్తే.. రోషన్ కత్తి తీసుకుని బయలు దేరాడు. ఎక్కడికి అని అడిగితే ఆ వ్యక్తి నాకు నచ్చలేదు అని సమాధానం ఇచ్చాడు. 

45
బిజినెస్ చేద్దామని అనుకున్నాం 

ఇది బాగా ఎక్కువవుతోంది అని కొంత కాలానికి సీరియల్స్ కూడా మానేసినట్లు సుమ పేర్కొంది. యాంకర్ అవకాశాలు బాగా పెరిగాయి. ఇప్పుడే జీవితం ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తోంది అని సుమ తెలిపారు.వాస్తవానికి కెరీర్ బిగినింగ్ లో నేను రాజీవ్ ఇండస్ట్రీ ని వదిలేసి ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకున్నాం. కానీ రాజీవ్ కి నర నరాల్లో నటనే ఉంది అని తెలిపింది. 

55
అప్పుడప్పుడూ సినిమాల్లో.. 

ప్రస్తుతం సుమ అప్పుడప్పుడూ నటిగా మెరుస్తున్నారు. ఇటీవల ఆమె ప్రియదర్శి ప్రేమంటే అనే చిత్రంలో పోలీస్ పాత్రలో నటించారు. ప్రస్తుతం సుమ టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు. అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుమనే యాంకర్ గా ఉంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories