సుమ, అనసూయ, ఝాన్సీ, లాస్య, ఉదయ భాను ఈ స్టార్ యాంకర్స్ లవ్ స్టోరీస్ ముందు సినిమాలు సరిపోవు!

First Published May 30, 2021, 5:31 PM IST

ఎవరినైనా దోమ కుట్టాల్సిందే, ప్రేమ పుట్టాల్సిందే. సెలెబ్రిటీ అయినా సామాన్యులైనా మనసులో ప్రేమ భావన కలగడం ఒకరిపై ఇష్టం కలగడం సాధారణం. గ్లామర్ ఇండస్ట్రీలో పనిచేసే బుల్లితెర, వెండితెర నటుల మధ్య ప్రేమలు చిగురించడం అవి పెళ్ళికి దారితీయడం జరుగుతూ ఉంటుంది. ఇక బుల్లితెర టాప్ స్టార్స్  సుమ, అనసూయ, లాస్య, ఉదయ భాను, ఝాన్సీ ప్రేమించిన మగవాడినే వరుడిగా తెచ్చుకున్నారు. సినిమా కథలకు ఏమాత్రం తక్కువ కానీ వీరి ప్రేమ కహానీలు చూద్దామా..

యాంకర్ వృత్తికి బ్రాండ్ అంబాసిడర్ సుమ కనకాల. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై తిరుగులేని మహారాణిగా ఆమె రాణిస్తున్నారు. ఈవెంట్ ఏదైనా సుమ ఉంటే ఆ సందడే వేరు. ఈ మాటల మంజరి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు.
undefined
ఓ స్టూడియోలో ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా మొదలై ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరికి ఇష్టం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అలా ప్రేమ పక్షులుగా మారిన వీరి పెళ్లి విషయంలో మాత్రం చిన్న సమస్య వచ్చిపడింది. ఆ సమయంలో హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలలో ఉన్న సుమను నటన మానేయాలని రాజీవ్ కోరడంతో కుదరదని చెప్పేసిందట. అయితే కొన్నాళ్ళకు ఇద్దరూ ఓ అభిప్రాయానికి వచ్చి పెళ్లి చేసుకున్నారు.
undefined
మొదటి తరం టీవీ యాంకర్స్ లో ఉదయ భాను ఒకరు. ఈ తెలంగాణ గడసరి పొడగరి పిల్ల బుల్లితెర స్టార్ యాంకర్ గా ఓ ఊపు ఊపారు. ఓ దశలో సుమ కూడా ఉదయ భాను తర్వాతే.
undefined
అలాంటి ఉదయభాను కొన్ని వ్యక్తిగత కారణాల వలన బంగారం లాంటి భవిష్యత్తు పాడు చేసుకుంది. నటిగా, ఐటెం భామగా, హీరోయిన్ గా కూడా చేసిన ఉదయభాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
undefined
బుల్లితెర హాట్ బాంబ్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకుల కలల రాణిగా ఉన్న అనసూయ లవ్ స్టోరీ తెలిస్తే సినిమా కథలు ఏమి సరిపోతాయి అంటారు.
undefined
ఇంటర్ చదివే రోజుల్లో ఓ ఎన్ సి సి క్యాంపులో భరద్వాజ్ తో పరిచయం ఏర్పడింది. డిగ్రీలో మరోమారు క్యాంపులో వీరు కలవడం, ప్రేమలు వ్యక్తం చేసుకోవడం జరిగింది. అయితే అనసూయ, భరద్వాజ్ పెళ్ళికి అనసూయ నాన్న ససేమిరా అన్నారట. దాదాపు ఏళ్ళ తరబడి తండ్రితో యుద్ధం చేసి భరద్వాజ్ ని కట్టుకుంది అనసూయ.
undefined
మరో బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించడం జరిగింది. ఆ విషయం తెలిసి ఆమె ఫాదర్ కుదరదని మందలించారు.
undefined
ప్రేమ కోసం ఇంటినుండి బయటికి వచ్చిన లాస్య మంజునాధ్ ని వివాహం చేసుకున్నారు. అయితే చాలా కాలం లాస్య తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. కొడుకు పుట్టాక తండ్రి కోపం తగ్గి దగ్గరయ్యారని ఆమె తెలిపారు.
undefined
సీనియర్ స్టార్ యాంకర్ గా ఝాన్సీ బుల్లితెర ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. సుమ, ఉదయభాను వంటి వాళ్లకు పోటీ ఇస్తూ ఝాన్సీ మంచి యాంకర్ అన్న గుర్తింపు తెచ్చుకున్నారు.
undefined
కాగా ఝాన్సీ టీవీ సెలబ్రిటీ నటుడు జోగి నాయుడుని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి బంధం సవ్యంగా సాగలేదు. ఓ పాప పుట్టిన తరువాత ఇద్దరూ విడిపోయారు. ఝాన్సీ కూతురుతో ఒంటరిగా ఉంటుండగా, జోగి నాయుడు మరో వివాహం చేసుకున్నారు.
undefined
click me!