ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరో చివరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారాడా...తరుణ్ పరిస్థితి ఎంత దయనీయం!

First Published | May 30, 2021, 2:48 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు నేషనల్ అవార్డ్స్, ఒక ఇంటర్నేషనల్ అవార్డు. రెండు నంది అవార్డ్స్. హీరోగా మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్. వరుస సూపర్ హిట్స్. నటుడిగా హీరో తరుణ్ అందుకున్న అరుదైన మైలురాళ్ళు ఇవి. మరి అలాంటి హీరో ఇప్పటి పరిస్థితి ఏమిటంటే, ప్రశ్నార్థకం.

హీరోయిన్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి కొడుకు తరుణ్. స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రెండు దశాబ్దాలు పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ కి రోజా రమణి తన గొంతు అరువు ఇచ్చారు.
పదుల సంఖ్యలో వివిధ బాషలలో హీరోయిన్ గా నటించిన ఆమె, తరుణ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు పరిచయం చేసింది.

1990లో విడుదలైన మనసు మమత చైల్డ్ ఆర్టిస్ట్ గా తరుణ్ కి మొదటి చిత్రం. 1995వరకు పలు చిత్రాలలో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఎనర్జీతో పాటు చక్కని నటన కలిగిన తరుణ్ చైల్డ్ ఆర్ట్స్ గా సూపర్ సక్సెస్. అందుకే తరుణ్ ని అనేక నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వరించాయి.
ఉషా కిరణ్ మూవీస్ పతాకంలో 2000లో విడుదలైన నువ్వేకావాలి చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఓ సంచలనం. ఏకంగా ఏడాది రోజులు ఆడిన నువ్వేకావాలి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
కొంచెం పొట్టిగా ఉన్నా, తన క్యూట్ లుక్స్ తో తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే వంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయన ఇమేజ్ మరింత పెంచాయి.
బ్లాక్ బస్టర్ ఆరంభం దొరికినా కెరీర్ కి గట్టి పునాది వేసుకోలేకపోయాడు తరుణ్. దండిగా వస్తున్న ఆఫర్స్ కాదనకుండా చేసుకుంటూ పోయారు. దీనితో ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఎంత త్వరగా ఎదిగాడో, అంతే త్వరగా క్రిందికి పడిపోయాడు.
2009లో వచ్చిన శశిరేఖా పరిణయం సినిమా తర్వాత తరుణ్ కి నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది.  2013లో చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అనే చిత్రం చేయగా, అది కూడా ప్లాప్. ఆతర్వాత వచ్చిన యుద్ధం, వేట అనే సినిమాలు జనాలకు తెలియకుండానే వెళ్లిపోయాయి.
చాలా గ్యాప్ తరువాత 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే మూవీ చేశారు. ఆ సినిమా తరుణ్ ఖాతాలో మరో ప్లాప్ గా నిలిచిపోయింది.  ప్రస్తుతం తరుణ్ ని హీరోగా పెట్టి సినిమా తీసే దర్శక నిర్మాత లేడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో బ్రదర్, బావా, ఫ్రెండ్ వంటి పాత్రలు వస్తున్నా, తరుణ్ కి ఆసక్తి చూపడం లేదు.
వీటికి తోడు డ్రగ్స్, లవ్ అఫైర్స్ అంటూ కొన్ని వివాదాలు తరుణ్ ని చుట్టుముట్టాయి. తరుణ్ కి డ్రగ్ ఫెడ్లర్స్ తో సంబంధాలు కలిగిఉన్నాడనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అధికారుల విచారణ సైతం ఎదుర్కొన్నాడు తరుణ్.
వీటికి తోడు డ్రగ్స్, లవ్ అఫైర్స్ అంటూ కొన్ని వివాదాలు తరుణ్ ని చుట్టుముట్టాయి. తరుణ్ కి డ్రగ్ ఫెడ్లర్స్ తో సంబంధాలు కలిగిఉన్నాడనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అధికారుల విచారణ సైతం ఎదుర్కొన్నాడు తరుణ్.
ఇక ఆర్తి అగర్వాల్ తో తరుణ్ ప్రేమ వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. ఆర్తి కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వీరి ఎఫైర్ ఆమెకు అనేక సమస్యలు తెచ్చిపెట్టింది.
కాగా తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇటీవల ఆహా యాప్ లో విడుదలైన అనుకోని అతిథి మూవీలో హీరో ఫహద్ ఫాజిల్ కి తరుణ్ డబ్బింగ్ చెప్పారు.

Latest Videos

click me!