ఈ రోజు ఎపిసోడ్లో మాళవిక, వేద ఇప్పటికీ నువ్వు ఖుషికి తల్లి గానే మిగిలిపోతావు. యశోదర్ కి మాత్రం భార్యవి కాలేవు వేద. బిడ్డలు కనలేని నువ్వు ఒక ఆడదానివా, కాపురం చేయని మీరు భార్యాభర్తల మీ ఇద్దరి బంధం త్వరలోనే బయటపెడతాను అనే మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు సులోచన మాలిని ఇద్దరు వింటూ ఉంటారు. యష్ ని నీకు దక్కకుండా చేస్తాను వేద అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. ఆ మాటలు విన్న సులోచన మాలిని, యష్ లు షాక్ అవుతారు. ఆ తరువాత మాలిని, సులోచన ఇద్దరూ సాంబ్రాణి ధూపం వేస్తూ ఒకరితో ఒకరు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.