సుకుమార్ భార్యను ఏడిపించిన సినిమా ఏదో తెలుసా..? అంతా ఎందుకు కనెక్ట్ అయ్యిందంటే..?

First Published | Oct 22, 2024, 5:31 PM IST

స్టార్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలు ఆయన భార్య చూస్తుందా..? చూస్తే ఏ సినిమా అంటే ఇష్టం...? సుకుమార్ భార్యను ఏడిపించిన సినిమా ఏదో తెలుసా..? ఇంతకీ ఆ సినిమా వల్ల ఆమె ఎందుకు ఏడ్చింది...? 
 

టాలీవుడ్ లో లెక్కల మాస్టర్ గా పేరున్న దర్శకుడు సుకుమార్.  సినిమాలు తియ్యడంతో ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది. ఒక్కో సినిమాకు హీరోను ఒక్కోలా చూపిస్తుంటాడు సుక్కు.  అంతే కాదు హీరోలలో కూడా విలనిజం చూపించడంలో సుకుమార్ స్టైలే వేరు. ఆయన సినిమాల్లో హీరో రా మెటీరియల్ లాగా కనిపిస్తుంటాడు. 
 

హీరోలోని నెగెటీవ్ కోణాన్నిటచ్ చేస్తూనే.. హీరోయిజాన్ని కూడా ఎలివేట్ చేస్తుంటాడు సుకుమార్. ఈక్రమంలోనే ఎన్నో అద్భుతమైన పాత్రలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది హీరోలకు సుకుమార్ సినిమాలు లైఫ్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ను హీరో మెటీరియల్ అని నిరుపించుకునేలా చేసిందే సుకుమార్ సినిమా. 

ఇప్పటకి ప్రేమ పక్షుల నోట వినిపించే మాట ఆర్య. ఈ పాటలు, ఈ సినిమా ఇప్పటికీ ప్రేమికుల మనసుల్లో అలా నిలిచిపోయి ఉంటుంది. అంతే కాదు అల్లు అర్జున్ ను పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ ను చేసింది కూడా సుకుమారే. ఇక పుష్ప2 తో అంతకు మించి చేయబోతున్నాడు లెక్కల మాస్టారు. మరి ఏం చేస్తాడో చూడాలి. 


ఇక సుకుమార్ స్కుూల్ నుంచి ఆర్య రెండు సినిమాలు, నాన్నకు ప్రేమలో, రంగస్థలం, వన్ నేనొక్కడినే, పుష్ప ఇలా అద్భుతమైన సినిమాలు బయటకు వచ్చాయి. అంతే కాదు సుకుమార్ కథలు అందించిన సినిమాలు కూడా ఎంతో మంది చిన్న హీరోలను నిలబెట్టాయి. ఈక్రమంలో ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. 

సుకుమార్ సినిమాలంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూసే జనాలు ఉన్నారు. అది సరే మరి సుకుమార్ ఫ్యామిలీకి ఆయన సినిమాలు నచ్చుతాయా. ముఖ్యంగా ఆయన భార్య తబితకు సుకుమార్ సినిమాలో ఏ సినిమా అంటే ఇష్టం. సుకుమార్  కథ అందించిన ఓ సినిమా చూసి ఆమె ఏడ్చేసిందట. కారణం ఏంటో తెలుసా..? 

ఈ విషయాన్ని సుక్కు  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మీ సినిమాల్లో మీ భార్య ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి..? మీసినిమాలు చూసి మీ వైఫ్ ఏమంటుంది అని అడగగా.. సుకుమార్ మాట్లాడుతూ.. నా సినిమాలు అన్ని చూస్తారు. కాకపోతే ఓక్క సినిమాకు నా వైఫ్ బాగా కనెక్ట్ అయ్యారు. అదే కుమారి 21ఎఫ్. ఈమూవీ ఎడిటింట్ అయిపోగానే ఆ రూమ్ లోనే చూపించాను. 

నా ఇల్లు పైన ఉంటుంది. ఎడిటింగ్ రూమ్ కింద ఉంటుంది. సినిమా చూడమని చెప్పి నేను పైకి వెళ్ళాను.. ఈసినిమా చూసిన వెంటనే నా భార్య పైకి వచ్చి.. డోర్ తియ్యగానే నన్ను గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూనే ఉంది. చాలాసేపు ఏడ్చింది. నీ ఆలోచనలు ఇంతలా ఉంటాయా..? ఇలా ఆలోచిస్తావా నువ్వు. అని ఎంతో ఇంప్రెస్ అయ్యి నాన్న పట్టుకుని ఏడ్చింది. 

నా లైఫ్ లో నా వైఫ్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే అంటూ వెల్లడించారు సుకుమార్.ఇక సుక్కు కామెంట్ తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప2 ను అంతకు మించి రూపొందించే పనిలో ఉన్నారు. ఈసినిమాతో ఆస్కార్ ను అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారట. టీమ్. 

Allu Arjun, #Pushpa2, sukumar

ఇక 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటాలని చూస్తున్నారట. ఇక దాదాపు షూటింగ్ ఎండ్ స్టేజ్ కు వచ్చింది. ఒక్కొక్క అప్ డేట్ ను కూడా ఇచ్చేస్తున్నారు. మరో వైపు ఇప్పటికే అగస్ట్ నుంచి పోస్ట్ పోన్ అయ్యింది సినిమా. డిసెంబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ డేట్ కూడా మారుతుంది అని న్యూస్ వైరల్ అవుతున్న క్రమంలో .. రీసెంట్ గా డిసెంబర్ రిలీజ్ పక్కా అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. 

Latest Videos

click me!