SUKUMAR - PUSHPA : సుకుమార్ నేనొక్కడినే సినిమా విషయంలో చేసిన పొరపాటే.. పుష్ప విషయంలో చేస్తున్నాడా..?

Published : Dec 14, 2021, 03:17 PM ISTUpdated : Dec 14, 2021, 03:24 PM IST

పుష్ప సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాని ప్రమోషన్స్ విషయంలో డెవలప్ మెంట్ లేదు.అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ పుష్పతో  పాన్ ఇండియాకు వెళ్తున్నాడు. ఈ సినిమా విషయంలో సుకుమార్ కు గతంలో చేసిన పొరపాటే చేయబోతున్నాడా..? 

PREV
19
SUKUMAR - PUSHPA : సుకుమార్  నేనొక్కడినే సినిమా విషయంలో చేసిన పొరపాటే.. పుష్ప విషయంలో  చేస్తున్నాడా..?

అసలే పుష్ప సినిమా షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయ్యింది. మధ్యలో కరోనా దెబ్బతో షూటింగ్ బాగా డిలై అవుతూ వచ్చింది. మధ్యలో లొకేషన్ ప్రాబ్లమ్..టీమ్ లో కరోనా కలకలం..ఇలా చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేసింది పుష్ప టీమ్. ఫైనల్ గా డిసెంబర్ 17న రిలీజ్ అంటూ..రెండు నెలల ముందే అనౌన్స్ చేసిన టీమ్.. ప్రమోషన్స్ మాత్రం నెగ్లెట్ చేసినట్టు కనిపిస్తుంది.
 
 


 

29

బన్నీ సినిమా అంటే మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ కు సెపరేట్ గా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియ్స్ లో బన్ని అంటే చింపేసుకునేంత పిచ్చి ఉంటుంది. అందులోను పుష్ప కంప్లీట్ గా మాస్ మూవీ కావడంతో.. ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్  ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మెప్పించేలా సుకుమార్ సినిమా చేశాడా..? సినిమా బాగా చేసినా.. టైమ్ అజెస్ట్ మెంట్ విషయంలో లేట్ చేసి... సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోష్స్ విషయంలో.. గతంలో లా ఇబ్బందుల కొని తెచ్చుకుంటుంన్నాడా అన్న డౌట్ రేజ్ అవుతుంది. 
 

39

ఎందుకంటే పుష్ప రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఇంకా పోస్ట్ ప్రోడక్షన్ పనులు కంప్లీట్ కాలేదు. అసలే సుకుమార్ పర్ఫెక్షనిస్ట్. ఏ చిన్న విషయం అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. జక్కన్న అన్న పేరు రాజమౌళికి ఉన్నా.. అంతకంటే ఎక్కువగా సినిమాను చెక్కడంతో సుకుమార్ మార్క్ వేరు. అయితే పుష్ప పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుక్కు. ఎంతా అంటే.. పుష్ప ప్రిరిలీజ్ ఈవెంట్ కు కూడా రాలేంత బిజీగా పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో మునిగిపోయాడు సుకుమార్. A

49

సినిమా రిలీజ్ దగ్గర పడుతుంటే.. ఇంకా పోస్ట్ ప్రోడక్షన్ పనలేంటి..? సినిమా ప్రమోషన్స్ మాట ఏంటీ..? అసలే ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్తున్నారు. సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు హిందీ, తమిళ్, మలయాళ,కన్నడ భాషల్లో ప్రమోషన్స్ గురించి ముందే.. ఎందుకు మేల్కొనలేదు. ఇంత తక్కువ టైమ్ లో ఐదు భాషల్లో ప్రమోషన్స్ ఎలా నిర్వహిస్తారు. 

59

గతంలో మహేష్ బాబుతో చేసిన  వన్ నేనొక్కడినే సినిమా విషయంలో కూడా సుకుమార్ ఇదే పొరపాటు చేశాడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించినా.. చివరి నిమిషయం వరకూ చెక్కుకుంటూ కూర్చున్నారు. ప్రమోషన్స్ విషయంలో నెగ్లెట్ చేశారు. ఈ విషయాన్ని సుకుమారే స్వయంగా ఒప్పుకున్నాడు. నాకు ఇంకాస్త టైమ్ దొరికుంటే.. ఈ సినిమా ను ఇంకా అద్భఉతంగా చేసేవాడిని అన్నారు. ఆ సినిమా 2014 జనవరిలో రిలీజ్ అయ్యింది. సినిమాపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానులను నిరాశపరిచింది. కాని మంచి ఎక్స్ పెర్మెంటల్ మూవీగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. 

69

ఇప్పుడు పుష్ప విషయంలో కూడా ఇది రిపిట్ అవుతుందేమో అన్న భయం ఫ్యాన్స్ లో ఉంది. అసలే తెలుగుతో పాటు మలయాళంలో కూడా బన్నీకి భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతీ సినిమా మలయాళంలో డబ్ అవ్వాల్సిందే. ఇక్కడ ప్లాప్  అయిన సినిమాలు కూడా అక్కడ సూపర్ సక్సెసె కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అక్కడ కూడా ముందు నుంచి ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ కు వెళ్తున్నారు టీమ్. అక్కడ మార్కెట్ టార్గెట్ చేసుకునే.. ఫహద్ పాసిల్ లాంటి స్టార్ ను పుష్ప కోసం తీసుకున్నారు. మరి ఆ విషయాన్ని ప్రమోట్ చేసుకోవాలి కదా..? 

79

అటు పాన్ ఇండియాలో నిలదొక్కుకోవాలి అంటే ముఖ్యంగా హిందీ మార్కెట్ ను టార్గెట్ చేశాలి. ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ సినిమా దూసుకు పోతోంది. రెండు నెలల ముందు నుంచే హడావిడి స్టార్ట్ చేశారు ట్రిపుల్ ఆర్ టీమ్. గతంలో సాహోలాంటి సినిమాలు కూడా ప్రమోషన్స్ వల్లనే హిందీ మార్కెట్ లో దూసకు పోయాయి. కాని పుష్ప హిందీ ప్రమోషన్స్ కు సంబంధించి ఇప్పటివరకూ చేసిందేమి లేదు. 
 

89

మొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా సుకుమార్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్  దేవి శ్రీ ప్రసాద్ కూడా కనిపించలేదు. ప్రిలీజ్ కు వచ్చిన గెస్ట్ లు కూడా పెద్దగా మాట్లాడింది లేదు. ఏదో తూతూమంత్రంగా ఈవెంట్ ను కానిచ్చేశారు. అటు అభిమానులతో ఫోటో షూట్ ప్లాన్ చేసుకుంటే.. అది  కూడా  రచ్చ రచ్చ జరిగి అభిమానులు గాయపడ్డారు. ఈ విషయంలో బన్ని అభిమానులకు క్షమాపణలు చెప్పారు కూడా. 

99

ఇఫ్పుడు రిలీజ్ రెండు రోజులు ఉందనగా తమిళ ప్రమోషన్స్ కు బయలుదేరారు టీమ్. ఈసారి ప్రమోషన్స్ కు దేవిశ్రీ కూడా హాజరయ్యారు. మిగతా బాషల్లో ప్రమోషన్ ఇంత తక్కువ టైమ్ లో చేయగలరా. ఒకవేళ గనుక పుష్ప ఆ బెల్ట్ లో పెర్ఫార్మన్స్ చేయలేకపోతే.. మాత్రం ప్రమోషన్ లేకపోవడమే అనేది మాత్రం ప్రధాన కారణం..! ఇంతకు ముందు సిచ్యూవేషన్ రిపిట్ అవ్వకుండా.. పుష్ప సినిమా అన్ని భాషల్లో ముందుకు పోగలుగుతుందా..? సుకుమార్ జాగ్రత్తగా అడుగులు వేసి.. బన్నీ ఇమేజ్ తో సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించాగలడా..? ఇలా ఎన్ని ప్రశ్నలు వస్తున్నా.. సినిమా మంచి విజయం సాధించాలని కోరకుందాం.. పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోవాలని ఆశిద్దాం. 
 

Read more Photos on
click me!

Recommended Stories