Allu Arjun: రామ్ చరణ్, మహేష్ చేసిన తప్పే చేస్తున్న అల్లు అర్జున్... మరీ ఇంత అలసత్వమా!

First Published Dec 14, 2021, 12:40 PM IST


పుష్ప (Pushpa)సినిమా రిలీజ్ కి కేవలం రెండు రోజులు వ్యవధి మాత్రమే ఉంది. ఇంకా ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో ఊపందుకున్న దాఖలాలు లేవు.


మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దర్శకుడు  సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కనబడలేదు.బన్నీతో అభిమానుల ఫోటో సెషన్స్ కార్యక్రమం రసాభాసకు దారితీసింది. బన్నీ హాజరుకాకపోవడం తో అభిమానులు నానా హంగామా చేశారు. ఈ గొడవలో ఫ్యాన్స్ కొందరు గాయాలపాలయ్యారు.  


అల్లు అర్జున్ (Allu Arjun) కి మలయాళం లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాకు ఏమాత్రం కనీస ప్రమోషన్స్ నిర్వహించినా మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంటుంది. కేరళలో పుష్ప సందడి కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా మలయాళ భాషలో  ట్రైలర్ విడుదల చేశారు. 

Pushpa

పుష్ప హిందీ వెర్షన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముంబైలో చిత్ర యూనిట్ ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించలేదు. కేవలం అజయ్ దేవ్ గణ్ తో ట్రైలర్ విడుదల చేయించారు, అది కూడా సోషల్ మీడియాలో. బాలీవుడ్ నుండి ఒక పెద్ద హీరోని కూడా రంగంలోకి  దించిన దాఖలాలు లేవు. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు 20 రోజుల సమయం ఉన్నప్పటికీ రాజమౌళి భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరులో పుష్ప కనిపించడం లేదు.

హిందీ బెల్ట్ లో ముఖ్యంగా బి,సి సెంటర్లలో మాస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.. సాహో సినిమా ఇక్కడ ప్లాప్ అయినా హిందీ వర్షన్ కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా మన తెలుగు మాస్ సినిమాలు హిందీలో డబ్ అయ్యాక యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. మాస్ యాక్షన్ చిత్రాలకు అక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ సెంట్రిక్ మూవీ పుష్ప అక్కడ నాచురల్ గా మంచి మార్కెట్ ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్స్ దాన్ని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకున్నట్లు కనబడడం లేదు. 


గతంలో రామ్ చరణ్ (Ram Charan)జంజీర్ సినిమా విషయంలో ఇదే తప్పు జరిగింది. మహేష్ (Mahesh) తమిళ్ ఎంట్రీ స్పైడర్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. అదే అల్లు అరవింద్ గనుక ఇప్పుడు ఉంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కనీసం జెర్సీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉన్న షాహిద్ కపూర్ ని, అమీర్ ఖాన్ ని కనీసం రంగంలోకి దించి పరిస్థితి సెట్ చేసేవాడు. 


భారీ చిత్రాలు నిర్మిస్తున్నప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయంలో కనీస అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో పూర్తిగా విఫలం కాగా, పుష్ప ఫలితం ఎలా ఉంటుందో అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ పుష్ప తెలుగులో హిట్ టాక్ తెచ్చుకొని హిందీతో పాటు ఇతర భాషల్లో పరాజయం చెందితే... అది పూర్తిగా నిర్మాతల వైఫల్యమే అని చెప్పాలి. 

అల్లు అర్జున్ తన ఫస్ట్ పాన్ ఇండియా చిత్రాన్ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సింది పోయీ, ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాల్లో ఆరితేరిన అల్లు అరవింద్ ఏం చేస్తున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా దూసుకెళుతున్న పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.   

Also read Pushpa: సమంత ఐటెం సాంగ్ పై కేసు నమోదు.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Also read Pushpa:ప్రీ రిలీజ్ ఈవెంట్ సుక్కూ స్కిప్ చేయటానికి అసలు కారణం

click me!