డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. హీరో పాత్రని పూరి మాస్ గా చూపిస్తూనే మిగిలిన దర్శకుల కంటే వైవిధ్యంగా ప్రజెంట్ చేస్తారు. కేవలం హీరో క్యారెక్టర్ వల్లే హిట్టైన పూరి జగన్నాధ్ చిత్రాలు బోలెడు ఉన్నాయి.
ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ పూరి జగన్నాధ్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ కి స్ఫూర్తి పూరి జగన్నాధ్ గారి సినిమాలే అని తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బద్రి చిత్రం అని తెలిపారు. కేవలం హీరో క్యారెక్టర్ తోనే సినిమా నడిపించవచ్చు అని పూరి జగన్నాధ్ నిరూపించారు.
బద్రి చిత్రం నాకు చాలా ఇష్టం. అప్పట్లో హీరో ఒకేసారి ఇద్దరితో లవ్ లో ఉండడం అనే అంశం చాలా రిస్క్. ప్రకాష్ రాజ్ పాత్ర కూడా నెగిటివ్ గా ఉండదు. తన చెల్లి కోసమే అతడి తపన అంతా. పూరి జగన్నాధ్ కూడా దీని గురించి చెప్పారు. ఆ సినిలో ప్రకాష్ రాజ్ కన్నా బ్యాడ్ క్యారెక్టర్ ఎవరంటే అది కళ్యాణ్ గారిదే. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో ఉంది మరో అమ్మాయిని ప్రేమిస్తాడు.
సుకుమార్ మాట్లాడుతూ ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ మామూలుగా ఉండవు. అదే చిత్రం ఇప్పుడు రిలీజ్ అయితే ఆ మ్యానరిజమ్స్ ఇండియా మొత్తం ట్రెండ్ అయ్యేవి అని సుకుమార్ తెలిపారు. ఆ స్ఫూర్తితోనే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర డిజైన్ చేసినట్లు సుకుమార్ తెలిపారు.
అదే విధంగా ఇడియట్ చిత్రం కూడా చాలా ఇష్టం అని తెలిపారు. అందులో ప్రకాష్ రాజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ ని కూడా ప్రేమగా పలకరించే మంచి వ్యక్తి. కానీ కూతుర్ని ఎవరో ప్రేమిస్తున్నాడని తెలిసి బ్యాడ్ అయిపోతాడు అని సుకుమార్ అన్నారు.