అనుష్క శెట్టి-ప్రభాస్ ల పెళ్లి అనివార్యమే అంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ అత్యధికంగా నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో జతకట్టారు. బాహుబలి 2 విడుదలయ్యాక వివాహం చేసుకుంటారనే వాదన గట్టిగా వినిపించింది.
సాహో మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ ని ఈ ప్రశ్న బాగా ఇబ్బంది పెట్టింది. ఎక్కడకు వెళ్లినా... అనుష్కను మీరు వివాహం చేసుకుంటున్నారట కదా? అని మీడియా ప్రతినిధులు అడిగారు. ప్రభాస్ అవన్నీ పుకార్లు మాత్రమే. మేము మంచి స్నేహితులం, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టత ఇచ్చారు.