దేవర తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడా?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'దేవర' చిత్రం ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు పండగ అనే చెప్పాలి. రిలీజ్ కు ముందు, విడుదల తర్వాత అంటే ఇప్పటి వరకు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.
దీంతో పాటు బాలీవుడ్ స్టార్లు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ల సౌత్ అరంగేట్రం సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే ఓపెనింగ్ డే కలెక్షన్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తుండగా, అంచనాలు భారీగానే ఉన్నాయి. భారత సినీ పరిశ్రమలో మరోసారి ఎన్టీఆర్ ముద్ర పడుతుందని భావిస్తున్నారు. 100 కోట్లకు పైగా తొలి రోజు కలెక్షన్లు సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.