ఇక ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా రెండు డిజాస్టర్స్ ను ఫేస్ చేశాడు రామ్ చరణ్, ఆచార్యతో పాటు రీసెంట్ గా చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో నిరాశపరిచింది. అయినా సరే రామ్ చరణ్ మార్కెట్ కాని, ఆయన ఇమేజ్ కాని ఏమాత్రం తగ్గలేదు. ఇక బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాపై మెగా ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
హ్యాట్రిక్ ఫెయిల్యూర్ అన్న పేరు రాకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు. బుచ్చాబాబు సినిమా కనుకు బ్లాక్ బస్టర్ అయితే.. ఆనెక్ట్స్ సుకుమార్ సినిమాగురించి నిశ్చింతగా ఉండొచ్చు. బుచ్చిబాబు సినిమాలో కూడా సుకుమార్ఓ చేయి వేస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి గురు శిష్యులు ఏంచేస్తారో చూడాలి.