వడివేలుని తన సినిమా నుంచి గెంటేసిన భారతీరాజా, కారణం ఏంటి? అసలేం జరిగిందంటే?

Published : Mar 19, 2025, 11:03 AM IST

Vadivelu and Bharathiraja Controversy: సౌత్ స్టార్ డైరెక్టర్  భారతీరాజా  తన సినిమా నుంచి స్టార్ కమెడియన్  వడివేలును బయటకు గెంటేశారట. ఆయన ఎందుకు అాలా చేశారు. కారణం ఏంటి? 

PREV
15
వడివేలుని తన సినిమా నుంచి గెంటేసిన భారతీరాజా, కారణం ఏంటి? అసలేం జరిగిందంటే?

Vadivelu and Bharathiraja Controversy: తమిళ,తెలుగు సినిమా అభిమానులను కడుపుబ్బ నవ్వించిన హాస్య నటులలో వడివేలు ఒకరు. తన బాడీ లాంగ్వేజ్‌తో అభిమానులను ఆకట్టుకున్న వడివేలు, తమిళ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. ఈ రోజుల్లో మీమ్ క్రియేటర్స్‌కి దేవుడు అంటే అది వడివేలునే. అతని కామెడీ సీన్సే ఈరోజుల్లో మీమ్ టెంప్లేట్స్‌గా సోషల్ మీడియాను ఆక్రమించాయి. ఆ స్థాయిలో ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసాడు వడివేలు. తెలుగులో బ్రహ్మనందం మాదిరి తమిళంలో వడివేలుకి స్టార్ డమ్ ఉంది. 

Also Read: 1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన మహేష్ బాబు సినిమా, వరల్డ్ రికార్డ్ సాధించిన సూపర్ స్టార్ మూవీ.

25
వడివేలు

వడివేలు సినిమాలో కమెడియన్‌గా నటించి ప్రజలను నవ్వించినా, నిజ జీవితంలో అతను కాస్త కఠినమైన వ్యక్తి అని అంటారు. అతనితో సహాయ పాత్రల్లో నటించిన చాలా మంది కమెడియన్లు వడివేలు నిజ స్వరూపం వేరని యూట్యూబ్‌ ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. కానీ వాటిని పట్టించుకోని వడివేలు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అతని చేతిలో గ్యాంగ్‌స్టర్స్, మారీసన్ వంటి సినిమాలు ఉన్నాయి.

Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

35
వడివేలు జీతం గొడవ

ఇలాంటి పరిస్థితుల్లో కిజక్కు చీమయిలే  సినిమాలో నటించడానికి ఎక్కువ జీతం అడిగి మొండికేసిన వడివేలును దర్శకుడు భారతీరాజా గెంటేసిన సంఘటన జరిగింది. దర్శకుడు భారతీరాజా ఇచ్చిన మాస్టర్ పీస్ సినిమాల్లో కిజక్కు చీమయిలే  సినిమా ఒకటి. ఈ సినిమాను తెలుగులో పల్నాటి పౌరుషం పేరుతో రీమేక్ చేశారు. కాగా తమిళంలో ఈమూవీని కళైపులి ఎస్. థాను నిర్మించారు. ఆ కాలంలోనే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

45
వడివేలు వర్సెస్ భారతీరాజా

సినిమా బడ్జెట్ ఎక్కువ అని తెలుసుకున్న వడివేలు, సరే మనం కూడా మన జీతం పెంచి అడుగుదామని నిర్ణయించుకుని, ఇందులో నటించడానికి రూ.25 వేలు  కావాలని అడిగాడట. దీంతో కోపానికి గురైన భారతీరాజా, నువ్వు నటించక్కర్లేదు వెళ్ళిపో అని చెప్పి గెంటేయడంతో అక్కడి నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోయాడట వడివేలు. ఇది చూసిన నిర్మాత థాను, ఏమైందని వడివేలును అడిగాడు. అతను ఏం జరిగిందో చెప్పాడు.

55
హాస్య నటుడు వడివేలు

ఆ తర్వాత వడివేలు అడిగిన రూ.25 వేలు జీతం ఇచ్చి అతన్ని ఓదార్చిన థాను, రెమ్యునరేషన్  విషయం నన్ను అడగకుండా అతన్ని ఎందుకు అడిగావు, ఇకపై నన్నే అడుగు అని చెప్పి పంపించాడట. ఈ విషయాన్ని థాను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమా వడివేలుకు ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

 

Read more Photos on
click me!

Recommended Stories