ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేసి, పాడిన జై హో పాట అందరికి తెలిసిందే. ఈ సాంగ్ రెండు ఆస్కార్ లను తీసుకువచ్చింది. అయితే ఈ పాటను ఫస్ట్ ఓ స్టార్ హీరో కోసం కంపోజ్ చేశారట. కాని అతను ఈ సాంగ్ వద్దంటూ రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఎవరా హీరో?
ఏ ఆర్ రెహమాన్ ఓ సినిమాకు సంగీతం చేస్తే, పాటలతో పాటు ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. మణిరత్నం రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే తన సత్తా చాటి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాల పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
మొదటి సినిమాకే జాతీయ అవార్డు కొట్టిన ఏ.ఆర్.రెహమాన్
1992 నుంచి ఇప్పటి వరకు తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో చాలా సినిమాలకు ఆయన మ్యూజిక్ చేశారు, చాలా పాటలు పాడారు. దాదాపు 33 ఏళ్లుగా సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు రెహమాన్.
ఏ.ఆర్.రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన జైహో పాట
2008లో వచ్చిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ సింగర్‌గా ఏ.ఆర్.రెహమాన్‌కు ఆస్కార్ వచ్చింది. ఏ ఆర్ రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చింది స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని జై హో పాట.
ఈ పాటను మొదట వేరే హీరో కోసం చేశారట. ఆ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్. యువరాజ్ సినిమా కోసం ఈ పాటను కంపోజ్ చేశారట రెహమాన్. కాని ఆ పాట వద్దని సల్మాన్ ఖాన్ చెప్పాడట. ఆ జై హో పాటనే ఇంగ్లాండ్ డైరెక్టర్ డానీ బాయిల్ 2008లో తీసిన స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో ఏ.ఆర్.రెహమాన్ వాడారు. ఈ పాటతో ఏ ఆర్ రెహమాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.