హాట్ బాంబ్ శ్రీరెడ్డితో సుడిగాలి సుధీర్, పక్కనే బిగ్ బాస్ ప్రియ... ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో

First Published | Oct 27, 2021, 8:24 AM IST

బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హాట్ బాంబ్ శ్రీరెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వీరి మధ్యలో Bigg boss ప్రియ కూడా వచ్చి చేరడం మరింత ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ఫోటో ఎక్కడిది, ఎప్పుడు?ఎలా? కలిశారన్న సందేహాలు మొదలైపోయాయి. 
 

ఏడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియ ఎలిమినేట్ అయ్యారు. అని మాస్టర్, ప్రియ మధ్య ఉత్కంఠ పోరు నడవగా చివరకు ప్రియ ఎలిమినేట్ కావడం జరిగింది.Bigg boss telugu 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళుతుంది అనుకుంటే ప్రియ 50రోజులకే తన జర్నీ ముగించారు. 

 సిల్వర్ స్క్రీన్ పై సాఫ్ట్ రోల్స్ చేసే ప్రియ తనలోని విలనీ, యాటిట్యూడ్, కోపం ప్రేక్షకులకు పరిచయం చేశారు. కంటెస్టెంట్ విజె సన్నీని ప్రియ కావాలని రెచ్చగొట్టేవారు. ఇక రవి. లహరి లేట్ నైట్ బాత్ రూమ్ లో హగ్ చేసుకోవడం చూశాను అంటూ చెప్పి బాంబు పేల్చారు. మొత్తంగా Priya తన గ్లామర్, క్యూట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకుంటున్నారు. 


ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే ఆమె చెన్నైలోనే ఉంటున్నారు. ఏదైనా అవసరం ఉంటే మినహా హైదరాబాద్ రావడం లేదు. చెన్నైలో ఉన్నప్పటికీ టాలీవుడ్ లో జరిగే విషయాలు, వివాదాలపై స్పందిస్తూ ఉంటారు. 

ఇటీవల హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి తన పనులు చక్కబెట్టుకొని తిరిగి చెన్నై వెళ్లిపోయారు. సంచలనం రేపిన మా ఎన్నికలపై కూడా Srireddy తనమార్కు కామెంట్స్ చేశారు. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ పై ఆమె విరుచుకుపడ్డారు. ఒంటరిగా ఉంటున్నా జబర్దస్త్ లైఫ్ లీడ్ చేస్తుంది శ్రీరెడ్డి. 

కాగా సుధీర్ సినిమాలు, టెలివిజన్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీ. బుల్లితెర సూపర్ స్టార్ గా ఎదిగిన Sudigali sudheer జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ షోలలో యాంకర్ గా ఉన్నారు. అలాగే ఆయన హీరోగా ఒకటి రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 
 

మరి ఈ ముగ్గురు సెలెబ్స్ ఓ ఫొటోలో కలిసి కనిపించడం ఆసక్తి రేపింది. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదు. 2018లో అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి సుధీర్ వెళ్ళాడు. అదే ఈవెంట్ లో ప్రియ, శ్రీరెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో వీరు ముగ్గురు కలిసి ఫొటోలకు పోజిచ్చారు. 


ఈ ఫోటో 2018లో ట్విట్టర్లో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.... స్క్రీన్ పై రొమాంటిక్ గా కనిపించే సుడిగాలి సుధీర్ నిజ జీవితంలో చాలా మంచి వ్యక్తితం ఉన్న వ్యక్తి అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడానికి బిగ్ బాస్ ప్రియనే. ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో ఆమెపై వరుస కథనాలు వెలువడుతున్నాయి. 

Also read Bigg Boss Telugu 5: ఫస్ట్ టైమ్‌ ఫిజికల్‌ టాస్క్ చేసిన షణ్ముఖ్‌.. మేం అడుక్కోవాలా అంటూ ప్రియాంకకి సిరి కౌంటర్‌

Also read మంచు మనోజ్‌ రెండో పెళ్లి.. నన్ను కూడా ఆహ్వానించండంటూ మంచు హీరో దిమ్మతిరిగే కౌంటర్‌

Latest Videos

click me!