అమలాపాల్‌ సంచలనం.. ఇండియన్‌ సినిమాలోనే ఫస్ట్ టైమ్‌.. బర్త్ డే రోజు క్రేజీ అప్‌డేట్‌..

First Published | Oct 26, 2021, 5:24 PM IST

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ తన పుట్టిన రోజున సంచలనాలకు తెరలేపింది. ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకు జరగని ఓ అరుదైన విషయానికి తెరలేపింది. క్రేజీ అప్‌డేట్‌తో వచ్చిన ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేసింది. నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. 
 

అమలాపాల్‌ గ్లామర్‌ సైడ్‌ తన కొత్త యాంగిల్స్ ని చూపిస్తుంది. ఇటీవల ఆద్యంతం సెక్సీ ఫోటోలను పంచుకుని నెటిజన్లకి చుక్కలు చూపించింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు పెళ్లి తర్వాత మరింతగా హాట్‌షోకి తెరలేపింది. ఇదంతా ఓ కోణమైతే, అంతకు మించిన సెన్సేషన్‌కి తెరలేపుతుంది అమలాపాల్‌. 
 

నేడు(అక్టోబర్‌ 26) మంగళవారం తన 30వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న అమలాపాల్‌ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తన పేరుని ఒక బ్రాండ్‌గా మార్చుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ విభిన్న మైన సినిమాలను దక్కించుకుంటూ, స్టార్‌ హీరోలతో జోడి కడుతూ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగింది. తన కెరీర్‌కి పెళ్లి అడ్డు వచ్చిన నేపథ్యంలో మ్యారేజ్‌ లైఫ్‌ని కూడా వదులుకుని కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దూసుకుపోతుంది. 


అమలాపాల్‌ ఆ మధ్య `ఆమె` చిత్రంతో సంచలనాలకు తెరలేపింది. ఇందులో న్యూడ్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. కానీ విశేష ప్రశంసలందుకుంది. ఇందులో అమలాపాల్‌ నటనకి మంచి పేరు రావడం విశేషం. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందుతున్న `కడవేర్‌`(శవం) అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర విశేషాలను పంచుకుంది అమలాపాల్‌. 

నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా అయిన `కడవేర్‌` ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో శవాల మధ్య కూర్చొని దర్జాగా భోజనం చేస్తుంది అమలాపాల్‌. ఇందులో ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్‌ నటించబోతుందట. అయితే ఇది ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్‌ అట. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలు కేవలం మేల్‌ యాక్టర్స్ మాత్రమే పోషించారని, ఫస్ట్ టైమ్‌ ఓ లేడీ ఇలాంటి పాత్రని పోషిస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అయ్యింది. 
 

ఇందులో మరో విశేషం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. థ్రిల్లర్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంతో అమలాపాల్‌ నిర్మాతగా మారుతుంది. `అమలాపాల్‌ ప్రొడక్షన్స్` ని ప్రారంభించి ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. ఈ విషయాన్ని అమలాపాల్‌ వెల్లడించింది. తాను ఇండస్ట్రీలో 12ఏళ్లుగా ఉంటున్నట్టు, ఆడియెన్స్ సపోర్ట్ వల్లే అమలాపాల్‌గా ఎదిగానని తెలిపింది. ఈ క్రమంలో తాను కొత్త స్టెప్‌ తీసుకున్నానని, `కడవేర్‌` చిత్రంతో నిర్మాతగా మారానని తెలిపింది. ఇది తనకు బేబీ స్టెప్ అని, ఫోరెన్సిక్‌ థ్రిల్లర్‌ అని, పోలీస్‌ సర్జన్‌గా, ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా తాను కనిపిస్తానని, వరుస మర్డర్‌ మిస్టరీలను ఛేదించే అధికారిగా తాను కనిపిస్తానని చెప్పింది అమలా. ఈ చిత్రానికి అనూప్‌ పనిక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 

ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటుంది. అయితే ఈ మోషన్‌ పోస్టర్ని అక్షయ్‌ కుమార్‌ కూడా తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అమలాపాల్‌కి అభినందనలు, బర్త్ డే విషెస్‌ తెలిపారు. థ్రిల్లర్‌ తనకు ఇష్టమైన జోనర్‌ అని చెప్పారు. ఆమె నిర్మాతగా మారడంపై కూడా విషెస్‌ తెలియజేశారు. సినిమా కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. దీనికి అమలాపాల్‌ స్పందించి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తన సినిమా మోషన్‌ పోస్టర్‌ని పంచుకోవడం పట్ల తన సంతోషాన్ని, ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సందర్బంగా అక్షయ్‌పై ప్రశంసలు కురిపించింది.

`బెజవాడ`, `లవ్‌ ఫెయిల్యూర్‌`, `నాయక్‌`, `ఇద్దరమ్మాయిలతో`, `జెండా పై కపిరాజు`, `పిట్టకథలు` వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ప్రస్తుతం `కడవేర్‌` చిత్రంతోపాటు `అదో అందా పారవై పోలా` చిత్రంలో నటిస్తుంది. మలయాళంలో `ఆడుజీవితం` అనే సినిమా విడుదలకు రెడీగా ఉంది. 

అమలాపాల్‌.. ప్రేమించి దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్లు కలిసి ఉన్న ఈ జోడీ 2017లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కెరీర్‌ పరమైన భేదాభిప్రాయాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్న అమలాపాల్‌.. కెరీర్‌లో ప్రయోగాల దిశగా దూసుకుపోతుంది. 
 

Latest Videos

click me!