దెయ్యాన్ని కూడా వదలని సుడిగాలి సుధీర్‌.. రాత్రికి రమ్మంటూ కామెంట్‌.. మనిషా? మృగమా?.. అంతా షాక్‌

Published : May 21, 2024, 08:02 PM IST

సుడిగాలి సుధీర్‌ అంటే రొమాంటిక్‌ ఇమేజ్‌ ఉంది. ప్లేబాయ్‌గా ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అయితే తాజాగా అది శృతి మించింది.   

PREV
19
దెయ్యాన్ని కూడా వదలని సుడిగాలి సుధీర్‌.. రాత్రికి రమ్మంటూ కామెంట్‌.. మనిషా? మృగమా?.. అంతా షాక్‌
photo-sarkaar4

జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు సుడిగాలి సుధీర్‌. ఆ షో సుధీర్‌కి లైఫ్‌ ఇచ్చింది. ఇమేజ్‌ని తెచ్చింది. సినిమా ఆఫర్లని కూడా తీసుకొచ్చింది. హీరోగానూ సక్సెస్‌ అయ్యాడు సుధీర్‌. అయితే ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఆయన ఆహాలో సర్కార్‌ 4 షో చేస్తున్నాడు. ఈటీవీలోనూ కనిపించబోతున్నారు. 
 

29

సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ షోలోనూ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌తో కామెడీ చేసి నవ్వులు పూయించాడు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో అదరగొట్టేవాడు. అమ్మాయిలను పడేసే కుర్రాడిగా, ఆడవాళ్లంటే పడి చచ్చే వ్యక్తిలా ఇలా ఏదో రూపంలో ఆ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌, డైలాగ్‌లు పేల్చుతూ ఆకట్టుకున్నాడు. దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్లు జబర్దస్త్ షోని రక్తికట్టించాడు.  

39

జబర్దస్త్ షోలో యాంకర్‌ రష్మితో కలిసి పులిహోర కలిపాడు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. నిజంగానే లవర్స్ లాగా యాక్ట్ చేసి మెప్పించారు. స్టేజ్‌పైనే రొమాన్స్ ని రక్తికట్టించి అలరించారు. జబర్దస్త్ షో రేటింగ్‌ని పెంచేశారు. అయితే నిజంగానే ఇద్దరి మధ్య రిలేషన్‌ ఉందనేది బయట వినిపించే మాట. కానీ ఈ ఇద్దరు మాత్రం మంచి ఫ్రెండ్స్ గా చెప్పుకుంటారు. 
 

49
photo-sarkaar4

ఇదిలా ఉంటే తాజాగా సుడిగాలి సుధీర్‌.. ఆహాలో `సర్కార్‌ 4` షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో `లవ్‌ మీ` యూనిట్‌ పాల్గొంది. హీరో ఆశిష్‌, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రవికృష్ణ పాల్గొన్నారు. వీరంతా హిలేరియస్‌గా నవ్వించారు. అయితే ఆశిష్‌ పంచ్ లు, రవికృష్ణ చేసిన కామెడీ నవ్వులు పూయించింది. 
 

59
photo-sarkaar4

ఇందులో ఆశిష్‌రావడం రావడంతోనే యాంకర్‌ సుడిగాలి సుధీర్‌ని ఆడుకున్నాడు. ఆశిష్‌ రాగానే. మీరు ఓ వర్గానికి ఇన్‌స్పిరేషన్‌ అని సుధీర్‌ అనగా, దేనికి అని రియాక్ట్ అయ్యాడు, దెయ్యాన్ని ప్రేమించడమేంటి? అని అడగ్గా, నేను ప్రేమించిన దెయ్యం, నా దివ్యావతి అంటాడు ఆశిష్‌. 
 

69
photo-sarkaar4

ఇక్కడే ఉంది అనగా, ఏది అని సుధీర్‌ దానితో మాట్లాడే ప్రయత్నం చేయగా, అయ్యో వెళ్లిపోయిందని చెప్పాడు ఆశిష్‌. దెబ్బకి సుధీర్‌కి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు తనలోని రోమియో బయటకు వచ్చాడు. రాత్రికి రమ్మను భయ్యా అని చెప్పడంతో అంతా షాక్‌ అయ్యారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో ఒరేయ్‌ నువ్వు మనిషివేనా, లేక పెద్ద మృగానివారా నువ్వు అని డైలాగ్‌లు రావడం నవ్వులు పూయించింది. 
 

79
photo-sarkaar4

ఆ తర్వాత హీరోయిన్లు వైష్ణవి చైతన్య, సిమ్రన్‌ చౌదరీ వచ్చారు. మీ సినిమా పేరేంటి అని సుధీర్‌ అడగ్గా, `లవ్‌ మీ ఇఫ్‌ యూ డేర్‌` అని ఇద్దరూ చెబుతారు. దీంతో ఓ నా వల్ల కాదని సుధీర్‌ మెలికలు తిరగడం విశేషం. అందంగా పుట్టడం నేను చేసిన తప్పా అని సుధీర్‌ అనగా, `ఛీ ఛీ` అని వెనకాల నుంచి సౌండ్‌ వచ్చింది. ఎవరు అన్నదని అడగ్గా, దివ్యావతి అని ఆశిష్‌ చెప్పడంతో కామెడీ పండింది.

89
photo-sarkaar4

అనంతరం వైష్ణవి చైతన్య రియాక్ట్ అవుతూ, దివ్యావతి వాళ్ల చెల్లి కూడా వస్తుందట. అనగా, ఆల్‌రెడీ మీరిద్దరు ఉన్నారు, ఇంకా వాళ్లిద్దరు మొత్తం నలుగురు అంటే అని అంటూ మెలికలు తిరిగాడు సుధీర్‌. దీనికి అబ్బా, అమ్మ అని వైష్ణవి సెటైర్లు పేలుస్తూ నవ్వించే ప్రయత్నం చేసింది. 
 

99
photo-sarkaar4

ఇంతలో రవికృష్ణ వచ్చాడు. సినిమా ట్రైలర్‌ చూశావా? అనగా, చూశా అని సుధీర్‌ చెప్పాడు. మ్యూజిక్‌ విన్నావా అంటే ఆ విన్నా నువ్వు కొట్టావా ఏంటి అని అడిగాడు సుధీర్‌. తనదైన స్టయిల్‌లో సౌండ్‌ చేస్తూ... దీనికి రవికృష్ణ రియాక్ట్ అవుతూ అది నీ సౌండ్‌ రా నువ్వు కొడతావు అని పంచ్‌లు వేయడంతో షో మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. ఇలా ఆద్యంతం ఫన్నీగా ఈ షో ప్రోమో సాగింది. అయితే కింద మాత్రం నెటిజన్లు రియాక్ట్ అవుతూ, సుధీర్‌పై పంచ్‌లు వేస్తున్నారు. ఇందులో కూడా అవి వదలడం లేదుగా అని, వామ్మో దెయ్యాన్ని కూడా వదలవా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories