అయితే రెండు మూడు సినిమాలతో అలరించిన సుధీర్.. ఆయన చేయాల్సిన సినిమాలు ఆగిపోయాయి. దీంతో మళ్లీ బుల్లితెర బాట పట్టాడు. ఇప్పుడు `ఆహా`లో `సర్కార్ 4` షో చేస్తున్నాడు. ఈటీవీలో `ఫ్యామిలీ స్టార్స్` షో చేస్తున్నాడు. తాజాగా `సర్కార్ 4`లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ షోకి ఇమ్మాన్యుయెల్, జబర్దస్త్ వర్ష, యాదమ్మ రాజు, అవినాష్, సిరి, శ్రీహాన్, బాబా భాస్కర్ మాస్టర్, అమర్ దీప్, శుభ శ్రీ, రోహిణి, ఫైమా పాల్గొన్నారు. నానా రచ్చ చేశారు. సుడిగాలి సుధీరే అంటే ఆయన్ని మించిన ఎనర్జీతో ఆడుకున్నారు.