సమీరా రెడ్డి పిల్లలకు నచ్చిన ఎన్టీఆర్‌ పాట ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా ఇంట్లో డాన్స్

Published : Jul 29, 2024, 09:21 PM IST

ఒకప్పటి గ్లామర్‌ హీరోయిన్‌ ఎన్టీఆర్‌, చిరంజీవితో కలిసి నటించిన విషయం తెలిసిందే. తారక్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపిన ఈ బ్యూటీ పిల్లలు కూడా ఎన్టీఆర్‌ ని ఇష్టపడుతున్నారట.   

PREV
16
సమీరా రెడ్డి పిల్లలకు నచ్చిన ఎన్టీఆర్‌ పాట ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా ఇంట్లో డాన్స్

సమీరా రెడ్డి తెలుగులో తళుక్కున మెరిసి మాయమైపోయింది. కానీ ఆమె గ్లామర్‌ షోతో ఇచ్చిన ట్రీట్‌ ఇప్పటికీ మర్చిపోవడం లేదు ఫ్యాన్స్. ఆమె అందాల విందు ఇప్పటికీ ఆడియెన్స్ ని వెంటాడుతూనే ఉంది. అదే సమయంలో తన మార్క్‌ ని చూపించింది. తెలుగులో సమీరా రెడ్డి నటించింది మూడు సినిమాలే. కానీ ఇప్పటికీ ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఆమెని ఫాలో అవుతూనే ఉన్నారు.  
 

26

చాలా రోజుల క్రితమే సినిమాలు మానేసిన సమీరా రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమవుతుంది. భర్త, పిల్లలు, వారి చదువులకే ప్రయారిటీ ఇస్తుంది. ఈ క్రమంలో సినిమాలకు దూరమైంది. అయితే తన ఇష్టాన్ని మరో రూపంలో ఆడియెన్స్ తో పంచుకుంటుంది. ఆమె చేసే పనులు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంది. ఇందులో చాలా వరకు ఫన్నీ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది సమీరా రెడ్డి. 
 

36

చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ఆమె తెలుగు మీడియాతో ముచ్చటించింది. తెలుగులో పనిచేయడం గురించి తన అభిప్రాయాన్ని మెమొరీస్‌ని పంచుకుంది. చిరంజీవి, ఎన్టీఆర్ తో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పింది. వారితో చేయడం పట్ల తన నాన్న ఎక్కువ హ్యాపీగా ఫీలవుతారని, అదే తనకు గర్వంగా అనిపిస్తుందని చెప్పింది సమీరా రెడ్డి. 
 

46

ఈ క్రమంలో ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. నటుడిగా ఎన్టీఆర్‌ ఎదిగిన తీరుని, అలాగే `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆయనకు గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల ఆమె హ్యాపీగా ఫీలయ్యింది. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది సమీరా రెడ్డి. ఈ క్రమంలో ఎన్టీఆర్‌పై తన స్పెషల్‌ ఇంట్రెస్ట్ ని చూపించింది. ఎన్టీఆర్‌ సినిమాల పాటలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ వింటామని చెప్పింది. 
 

56

ఈ సందర్భగా తన పిల్లల ఇంట్రెస్ట్ ని వెల్లడించింది. ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `నాటు నాటు` పాట తనకు బాగా ఇష్టమని, తమ పిల్లలకు కూడా అదే ఫేవరేట్‌ సాంగ్‌ అని చెప్పింది. ఇప్పటికీ ఇంట్లో ఆ పాటని పెట్టుకుని డాన్స్ చేస్తుంటారని వెల్లడించింది సమీరా రెడ్డి. అంతేకాదు `అశోక్‌` సినిమాలోని పాటలన్నీ తన ఫేవరేట్‌ సాంగ్స్ అని చెప్పింది సమీరా రెడ్డి. 
 

66
NTR

సమీరా రెడ్డి తెలుగులో ఎన్టీఆర్‌తో `నరసింహుడు`, `అశోక్‌` సినిమాలు చేసింది. చిరంజీవితో `జై చిరంజీవ` మూవీలో నటించింది. గ్లామర్‌తో ఉర్రూతలూగించింది. అయితే ఎన్టీఆర్‌తో ఆమె లవ్‌ ట్రాక్‌ నడిపించిందనే రూమర్స్ వచ్చాయి. తారక్‌ కూడా ఆ ఇంట్రెస్ట్ ని వెల్లడించారు. సీరియస్‌గానే ఈ ఇద్దరు లవ్‌ లో ఉన్నారట. కానీ ఎన్టీఆర్‌ ఫ్యామిలీ నో చెప్పడంతో బ్రేకప్‌ చెప్పుకున్నట్టు టాక్‌. 2024లో బిజినెస్‌ మేన్‌ని పెళ్లి చేసుకున్న సమీరా రెడ్డి ఆ తర్వాత సినిమాలు మానేసింది. ఆమెకి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories