సుడిగాలి సుధీర్‌, రష్మి రహస్యంగా కలుస్తున్నారా? ఆవేశంలో అసలు మ్యాటర్‌ లీక్‌ చేసిన జబర్దస్త్ కమెడియన్‌

Published : Dec 16, 2024, 05:44 PM IST

జబర్దస్త్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌, యాంకర్ రష్మి చాలా రోజులుగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కానీ రాంప్రసాద్‌ నోరుజారాడు. రహస్యంగా కలుస్తున్నారని చెప్పడం విశేషం.   

PREV
15
సుడిగాలి సుధీర్‌, రష్మి రహస్యంగా కలుస్తున్నారా? ఆవేశంలో అసలు మ్యాటర్‌ లీక్‌ చేసిన జబర్దస్త్ కమెడియన్‌

జబర్దస్త్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని టీవీ ఆడియెన్స్ అంతా నమ్ముతుంటారు. జబర్దస్త్ ఫాలో అయ్యే వాళ్లు ఇది నిజమే అంటున్నారు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా నమ్ముతారు. గత కొంత కాలం క్రితం బుల్లితెరపై ఈ ఇద్దరు చేసిన రచ్చ ఆ రేంజ్‌లో ఉంది మరి. అందుకే రష్మిని, సుధీర్‌ని వేరుగా చూడలేరు. ఇప్పటికీ అదే భావనలో ఉన్నారు. 

చిరు, బాలయ్య, చైతూ.. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోలు వీరే
 

25
Sudigali Sudheer - Rashmi gautam

అయితే దాదాపు రెండేళ్లుగా ఈ ఇద్దరు విడిగా ఉంటున్నారు. అంటే కలిసి షోస్‌ చేయడం లేదు. ఇద్దరు కలిసిన సందర్భాలు కూడా తక్కువే. సుడిగాలి సుధీర్‌ హీరోగా అవకాశాలు రావడంతో బుల్లితెరని వదిలేసి సినిమాల్లోకి వెళ్లాడు. కానీ సినిమా తేడా కొట్టింది. నటించిన సినిమాలు సక్సెస్‌ కాలేదు.

దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయాయట. మరికొన్ని చర్చల దశ నుంచి ముందుకు సాగడం లేదని తెలుస్తుంది. దీంతో మళ్లీ టీవీ షోస్‌ చేశాడు సుధీర్‌. `సర్కార్‌ 4`, `ఫ్యామిలీ స్టార్స్` షోలకు యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. రష్మికి పోటీగా ఈ షోస్‌ చేసి మెప్పించాడు. 

35

మరోవైపు ఇప్పటికీ జబర్దస్త్ ని వదలడం లేదు రష్మి. `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తుంది. అలాగే `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌ గా చేస్తుంది. ఈ రెండు చాలా ఏళ్లుగా రన్ అవుతున్నాయి. బుల్లితెర ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాయి. ఆద్యంతం ఆదరణ పొందుతున్నాయి.

ఇలా యాంకర్‌గా బిజీగా ఉంటుంది రష్మి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మి, సుధీర్‌ ఇటీవల పెద్దగా కలిసినట్టుగా లేదు. దీంతో ఇద్దరు ఒకరికొకరు దూరంగానే ఉంటున్నారని ఫిక్స్ అయ్యారు. ఇద్దరి మధ్య ఏం లేదనే భావనకు వచ్చారు.  
 

45

ఇంతలో సడెన్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు జబర్దస్త్ కమెడియన్‌ రామ్‌ ప్రసాద్‌. రష్మి, సుధీర్‌లకు సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ ఇద్దరు కలిసే ఉంటున్నట్టుగా తెలిపారు. షోలోనే ఆయన నోరు జారాడు. రష్మి, సుధీర్‌ రహస్యంగా కలుస్తున్నారని, అది ఎవరికీ తెలియదని తెలిపారు.

శ్రీదేవి డ్రామా కాంపెనీ లేటెస్ట్ ప్రోమో లో ఈ విషయాన్ని తెలిపారు. దీంతో దెబ్బకి అంతా షాక్‌ అయ్యారు. సీక్రెట్‌గా కలవడమంటే తమ ప్రేమని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. మరి రాంప్రసాద్‌ ఉద్దేశ్యం అదేనా అనేది ఆశ్చర్యంగా మారింది. 
 

55

అయితే రష్మి, సుధీర్‌ల ప్రేమ పెద్ద మిస్టరీ. షోస్‌లో పైకి ప్రేమలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఒకరిపై ఒకరు సిగ్గుపడుతుంటారు. మెలికలు తిరుగుతుంటారు. చాలా సార్లు లవ్‌ ప్రపోజ్‌ చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. పెళ్లి వరకు వెళ్లారు. షో కోసం ఇంతగా రచ్చ చేశారు.

రియల్ లైఫ్‌లోనే అదే ప్రేమ ఉందని అంతా అనుకుంటున్నారు. అయితే తామిద్దరం మంచి స్నేహితులం అని, స్నేహానికి మించిన బాండింగ్‌ అంటుంటారు. మరి అదేంటనేది చెప్పడంలో లేదు. దీనికి తెరపడాలంటే ఎవరో ఒకరు మ్యారేజ్‌ చేసుకోవాలి. అప్పుడు వీరి బాండింగ్‌పై క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. 

read more: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం సరికాదు, సంధ్య థియేటర్ ఘటనలో తప్పు వారిదే.. సుమన్ సంచలన వ్యాఖ్యలు
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories