చిరు, బాలయ్య, చైతూ.. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోలు వీరే
entertainment Dec 16 2024
Author: Aithagoni Raju Image Credits:google
Telugu
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గతేడాది `భోళా శంకర్`, `వాల్తేర్ వీరయ్య`తో వచ్చారు. కానీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. వచ్చే ఏడాది `విశ్వంభర`తో రాబోతున్నాడు.
Image credits: Social Media
Telugu
బాలకృష్ణ
గతేడాది `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` చిత్రాలతో హిట్ అందుకున్న బాలయ్య ఈఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. వచ్చే సంక్రాంతికి `డాకు మహారాజ్`తో రాబోతున్నారు.
Image credits: our own
Telugu
రామ్ చరణ్
రామ్ చరణ్ థియేటర్లో కనిపించి రెండేళ్లు అవుతుంది. గతేడాది, ఈ ఏడాది ఆయన సినిమాలు రిలీజ్ కాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి `గేమ్ ఛేంజర్`తో రాబోతున్నారు.
Image credits: x
Telugu
నాగచైతన్య
గతేడాది `కస్టడీ`తో డిజప్పాయింట్ చవిచూసిన నాగచైతన్య ఈ ఏడాది థియేటర్లో కనిపించలేదు. ఇప్పుడు `తండేల్` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.
Image credits: our own
Telugu
కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ చివరగా `అమిగోస్`, `డెవిల్` చిత్రాలతో వచ్చి డిజప్పాయింట్ చేశాడు. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. నెక్ట్స్ ఇయర్ మూడు సినిమాలతో రాబోతున్నాడు.
Image credits: our own
Telugu
నితిన్
నితిన్ సైతం ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆయన `రాబిన్‌హుడ్`, `తమ్ముడు` చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఇవి రిలీజ్ కానున్నాయి.
Image credits: our own
Telugu
అఖిల్ అక్కినేని
గతేడాది `ఏజెంట్`తో ఫ్లాప్‌ని చవి చూసిన అఖిల్.. ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. వచ్చే ఏడాది భారీ సినిమాతో రాబోతున్నాడు.