ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో తీవ్ర చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు కూడా ఆసుపత్రిలో విషమ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటపై అల్లు అర్జున్ కూడా ఒక కారణం అంటూ పోలీసులు అనేక సెక్షన్స్ కింద అతడిపై కేసులు నమోదు చేశారు.
Allu Arjun
శుక్రవారం రోజు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం దేశం మొత్తం సంచలనం అయింది. జాతీయ మీడియాలో కూడా డిబేట్లు నడిచాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి సంబంధం లేదు అని.. ఈ సంఘటనలో బన్నీని బలిపశువుని చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.
Actor suman
బన్నీ తనవంతు సాయంగా రేవంతి కుటుంబ సభ్యులకు 25 లక్షలు ప్రకటించారు. సెలెబ్రిటీలు కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు.బన్నీ విడుదలయ్యాక తండోప తండాలుగా సెలెబ్రిటీలు పరామర్శిచడానికి వెళ్లారు.
ఈ సంఘటనపై సీనియర్ హీరో సుమన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేదు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తప్పు. జరిగిన సంఘటన దురదృష్టకరం. ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత తీసుకోవాల్సింది థియేటర్ యాజమాన్యమే అని సుమన్ తెలిపారు.
ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో థియేటర్ కి వస్తున్నప్పుడు తగిన ఏర్పాట్లు చేయడం వారి బాధ్యత. థియేటర్ వద్ద ఎంత మంది జనం ఉన్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలు మొత్తం యాజమాన్యమే చూసుకోవాలి అని సుమన్ తెలిపారు. తాను హీరోగా నటిస్తున్నప్పుడు కూడా చాలా మంది థియేటర్ ఓనర్లు తనని ఇన్వైట్ చేసేవారు అని సుమన్ తెలిపారు. నేను వెళుతున్నప్పుడు తగిన ఏర్పాట్లు చేసేవారు అని సుమన్ అన్నారు. ఏది ఏమైనా ఈ సంఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదు. నటులు ఎవరైనా థియేటర్ కి వెళ్లొచ్చు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకోవాలి అని సుమన్ అన్నారు.