యాంకర్ రష్మీ, సుధీర్ మధ్య లవ్ స్టోరీ అందరికి తెలిసిందే. ఇది తెరకే పరిమితమని కొందరంటున్నా, వాళ్లు మాత్రం రియల్ లైఫ్‌లో తామిద్దరం పెయిర్ అయ్యేంత వరకు ఒకరినొకరు వదులుకునేలా లేరు.
ఛాన్స్ దొరికితే ఒకరిపై ఒకరు ప్రేమని వ్యక్తం చేసుకుంటున్నారు. స్టేజ్ పైనే డ్యూయెట్లు పాడుకుంటున్నారు.
తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమోలో వీరిద్దరు మరింతగా రెచ్చిపోయారు. యూనిట్ ముందు, జడ్జ్ లు మనో, రోజాల ముందే సుధీర్.. రష్మీకి తన ప్రేమని వ్యక్తం చేశాడు. అందరిని సర్‌ప్రైజ్ చేశారు.
రష్మీ బర్త్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్‌లో స్సెషల్ స్కిట్ చేశారు సుధీర్ అండ్ జబర్దస్త్ టీమ్. ఇందులో రష్మీకి బర్త్ డే ఏర్పాటు చేశారు. కేక్, డెకరేషన్‌తో అరేంజ్‌మెంట్స్ అదిరిపోయాయి.
ఎందుకిన్ని ఏర్పాట్లు అని రష్మీ అడగా, ఈ రోజు పండగ అంటూ సుధీర్ చెప్పారు. ఇప్పుడేం పండగ ఉందంటూ అమాయకంగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది రష్మీ.
మీ పుట్టిన రోజు మాకు పండగే కదండి, పండగ అంటే సెలవు ఇవ్వాలి కదండి అంటూ కమల్ హాసన్‌ని మించిన నటన ప్రదర్శించారు.
అమాయకత్వంతో కూడిన ఎక్స్ ప్రెషన్స్ తో మహా నటుడు అనిపించుకున్నాడు సుధీర్.
దీనికి నా బర్త్ డేకి ఇంత ఎందుకని తెలిపింది రష్మి. దీనికి అదిరిపోయే సమాధానమిచ్చాడు సుధీర్. `మీరు జస్ట్ బర్త్ డే అనుకుంటున్నారు. నేనేమో నాకోసమే పుట్టార`ని అనుకుంటున్నా అని తెలిపాడు.
దీంతో రష్మీ సిగ్గులతో ముగ్గులేసింది. మరోవైపు సుధీర్ సైతం సిగ్గులతో యాక్షన్ పీక్‌లోకి తీసుకెళ్లాడు. వేదికపైనే తన ప్రేమని ప్రపోజ్ చేశారు.
అంతేకాదు వీరిద్దరు `ఉప్పెన` సినిమాలోని డైలాగ్‌లకు, సాంగ్‌లకు డ్యూయెట్లు పాడుకున్నారు.