సీనియర్‌ నటుడుకి భార్యగా టీవీ నటి.. 25ఏళ్ల తేడాపై యంగ్‌ బ్యూటీ షాకింగ్‌ కామెంట్‌

Published : May 29, 2021, 08:22 AM ISTUpdated : May 29, 2021, 08:24 AM IST

టీవీ నటి ప్రియాల్‌ మహజన్‌ సీనియర్‌ నటుడితో రొమాన్స్ చేస్తుంది. 44ఏళ్ల వయసున్న వ్యక్తికి 19ఏళ్ల ప్రియాల్‌ భార్య అయ్యేందుకు అంగీకరించింది. 25ఏళ్ల ఏజ్‌గ్యాప్‌పై ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ షాక్‌కి గురి చేస్తుంది. 

PREV
16
సీనియర్‌ నటుడుకి భార్యగా  టీవీ నటి.. 25ఏళ్ల తేడాపై యంగ్‌ బ్యూటీ షాకింగ్‌ కామెంట్‌
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కలర్స్ టీవీలో `మోల్కీ` అనే సీరియల్‌ టాప్‌ రేటింగ్‌తో రన్‌ అవుతుంది. ఏక్తాకపూర్‌ నిర్మిస్తున్న ఈ సీరియల్‌లో 44ఏళ్ల వయసున్న అమర్‌ ఉపాధ్యాయకి భార్యగా యంగ్‌ బ్యూటీ ప్రియాల్‌ మహజన్‌ నటిస్తుంది. దాదాపు వీరి మధ్య ఏజ్‌ డిఫరెన్స్ 25ఏళ్లు ఉంటుంది.

26
ఇంతటి ఏజ్‌ డిఫరెన్స్ ఉన్న నటుడితో యాక్ట్ చేయడంపై నటి స్పందించింది. దీనిపై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ఏజ్‌ని తాను ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించింది. ఇంకా ఆమె చెబుతూ,

36
`వయసు తేడా నన్ను పెద్దగా బాధించడం లేదు. ఎందుకంటే ప్రతి రోజు నేను అమర్‌ సర్‌ నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటాను. ఆయన నటించిన `క్యుంకీ సాస్‌ భీ కబీ బాహు థి`, `సాత్‌ నిభానా సాథియా` సీరియల్స్ చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా` అని తెలిపింది.

46
అలాగే ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించడంపై కూడా స్పందిస్తూ, `నేను అమర్ సార్ నుండి నేర్చుకున్నట్లు, వారిద్దరికి (అనుష్క శర్మ, రిత్విక్ గుప్తా) కూడా నేను పలు విషయాలను బోధిస్తుంటాను. వారికి నాకు 10-14 సంవత్సరాల గ్యాప్‌ ఉంటుంది. వాళ్లు స్కూల్‌కు వెళ్లడం కుదరనప్పుడు సెట్‌కే పుస్తకాలు తీసుకువస్తారు. అప్పుడు నేను వారికి చదువులో సాయం చేస్తాను.

56
అంతేకాదు వారితో కలిసి సరదాగా అల్లరి చేస్తుంటాను. ఇది నాకు మంచి అనుభూతినిస్తుంది` అని ఆమె పేర్కొంది.

66
పేద కుటుంబానికి చెందిన పూర్వీ అనే యువతి డబ్బు కోసం పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. కేవలం తన పిల్లలకు తల్లి అవసరమని ఆ యువతిని వివాహం చేసుకున్న ఆ వ్యక్తికి, యువతి మధ్య ఏర్పడే ప్రేమ బంధమే ఈ సీరియల్‌ కథ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories