అయ్యో అది నిజం కాదు,  కానీ మీ ప్రేమకు ధన్యవాదాలు, జాతిరత్నం చిట్టి ఆసక్తికర కామెంట్స్!


 
చిన్న టపాసుల వచ్చి ఆటం బాంబులా పేలింది జాతి రత్నాలు మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన ఫరియా అబ్దుల్లా కూడా బాగా ఫేమస్ అయ్యింది. 
 

jathi ratnalu fame faria abdullah clarifies that this not her birthday date ksr
కుర్రకారు చిట్టి చిట్టి అంటూ వెంట పడుతున్నారు. ఆ మధ్య ఓ షాప్ ఓపెనింగ్ వెళితే జనాలు గుంపులుగా ఎగబడ్డారట ఫరియాను చూడడానికి. సదరు ఫోటోలు పంచుకున్న ఫరియా సంతోషం వ్యక్తం చేసింది.
ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి అమాయకత్వపు నటన కుర్రాళ్లకు భలే నచ్చేసింది. అందుకే ఆమెకు ఒక్క సినిమాతోనే ఫాలోయింగ్ వచ్చేసింది. దీనితో ఆమెకు ఆఫర్స్ కూడా వరుస కట్టే సూచనలు కలవు.

కొంచెం జనాల్లో గుర్తింపు వచ్చిందో లేదో.. దానిని మరో లెవెల్ కి తీసుకెళ్ళే యోచనలో ఉంది ఫరియా . సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్, డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఫరియా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ పిచ్చ వైరల్ అవుతున్నాయి.
కాగా ఫరియా పుట్టినరోజు అంటూ సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫరియా ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ చేయడం జరిగింది.
అయితే ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నట్లు ఆమె పుట్టినరోజు ఇప్పుడు కాదట. ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని. నా పుట్టిన తేదీ వేరని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే నిజమని నమ్మి బర్త్ డే విషెస్ తెలిపిన వారికి నా కృతజ్ఞతలు అని ఫరియా చెప్పారు.
ఇక ఇటీవల ప్రసారం అయిన డాన్స్ ప్లస్ షో ఫైనల్ లో ఫరియా రచ్చ చేశారు. లుంగీ కట్టులో క్రేజీ స్టెప్స్ వేసి అదరగొట్టారు. డాన్స్ ప్లస్ ఫైనల్ లో ఫరియా పెర్ఫార్మన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Latest Videos

vuukle one pixel image
click me!