కొడుకు వరుణ్ తో దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నాగబాబు... వైరల్ గా వెకేషన్ ఫోటోలు

First Published | Oct 25, 2021, 8:57 AM IST


నాగబాబు, వరుణ్ వెకేషన్ మూడ్ లో ఉన్నారు. వాళ్ళు తమ దుబాయ్ ట్రిప్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తండ్రీకొడుకుల వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారాయి. 

Varun tej కి షూటింగ్ నుండి విరామం దొరికింది. ఆయన లేటెస్ట్ మూవీ గని విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 3న గని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. షూటింగ్స్ నుండి కొంచెం బ్రేక్ దొరకడంతో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబుతో కలిసి దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఓ వారం రోజుల దుబాయ్ ట్రిప్ కోసం అక్కడకు వెళ్లినట్లు తెలుస్తుంది. 

ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టి20 క్రికెట్ ని లైవ్ లో చూసి ఎంజాయ్ చేశారు. చాలా కాలం తరువాత India vs pakisthan దేశాల మ్యాచ్ ని ప్రత్యక్షంగా నాగబాబు, వరుణ్ వీక్షించారు. స్టేడియం లో ఆహ్లాదంగా గడిపిన వారి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ మ్యాచ్ లో ఇండియా ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. 


అలాగే నాగబాబు హీరో రవితేజను కలవడం జరిగింది. ఖిలాడీ షూటింగ్ లో భాగంగా Raviteja దుబాయ్ వెళ్లారు. వీరిద్దరూ ఫ్లైట్ లో పక్కపక్క సీట్లో ప్రయాణం చేశారట. రవితేజతో సెల్ఫీ దిగి, ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక ఆయనతో కలిసి ప్రయాణం చేయడంతో ఎంతో అనుభూతిని కలిగించిందని నాగబాబు కామెంట్ చేశారు. 


ఇక దుబాయ్ లో షాపింగ్, ఖరీదైన హోటల్స్ లో స్టే, ఫుడ్.. ఇలా మనసుకు నచ్చినట్లు నాగబాబు, వరుణ్ వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు నిర్మాతగా నష్టాల పాలైన నాగబాబు జబర్ధస్త్ షో జడ్జిగా మారి, ఆర్థికంగా స్థిరపడ్డారు. కొడుకు వరుణ్ ఓ స్థాయి హీరోగా ఎదిగిన తరువాత మరింత ఉన్నత స్థితికి కుటుంబం చేరింది. 

గత ఏడాది నిహారిక వివాహం Nagababu చాలా గ్రాండ్ గా చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు వివాహం జరపడం జరిగింది. మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్న ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అందరూ ప్రత్యేకంగా చెప్పుకున్నారు. 


ఇక వరుణ్ Ghani చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై ఆసక్తిరేపుతున్నాయి. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Also read యూట్యూబ్ ఛానల్స్ ని టార్గెట్ చేసిన మంచు విష్ణు.. హీరోయిన్లపై అసభ్యంగా..

Also read గోవా బీచ్ లో అలాంటి ఫోజులో... సెగలు రేపుతున్న నిహారిక బోల్డ్ లుక్

Latest Videos

click me!