సుడిగాలి సుధీర్‌ బ్యాక్‌ టూ ఈటీవీ.. సినిమాలు వదిలేసి మళ్లీ బుల్లితెర ఎంట్రీకి కారణమేంటి?.. ఏం జరిగింది?

Published : May 15, 2024, 06:40 PM IST

`జబర్దస్త్` కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ టీవీని వదిలేసి సినిమాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైకి వస్తున్నారు. కొత్త షో చేస్తున్నారు.   

PREV
18
సుడిగాలి సుధీర్‌ బ్యాక్‌ టూ ఈటీవీ.. సినిమాలు వదిలేసి మళ్లీ బుల్లితెర ఎంట్రీకి కారణమేంటి?.. ఏం జరిగింది?
Pradeep Machiraju- Sudigali Sudheer

సుడిగాలి సుధీర్‌.. `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కామెడీ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. స్టార్లని చేసింది. అందులో సుడిగాలి సుధీర్‌ ఒకరు. ఆయన హీరోగా రాణించడం విశేషం. సుడిగాలి సుధీర్‌ ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. 
 

28
photo credit-dhee promo

ఇందులో `కాలింగ్‌ సహస్త్ర` పెద్దగా ఆడలేదు. డిజాస్టర్‌ అయ్యింది.`సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`, `గాలోడు` సినిమాలు మంచి ఆదరణ పొందాయి. థియేట్రికల్‌గా, డిజిటల్‌ పరంగానూ నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. 
 

38
Pradeep Machiraju- Sudigali Sudheer

ప్రస్తుతం `గోట్‌` అనే సినిమాలో నటిస్తున్నారు సుడిగాలి సుధీర్‌. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్‌ కావాల్సి ఉంది. ఈ క్రమంలో తాజాగా సుడిగాలి సుధీర్‌ మళ్లీ బుల్లితెరకి తిరిగి వస్తుండటం, షోస్‌ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే `ఆహా`లో `సర్కార్‌ 4` షో చేస్తున్నారు సుధీర్. ప్రదీప్‌ మాచిరాజు స్థానంలో సుధీర్‌ యాంకర్‌గా మారాడు. 
 

48

ఇప్పుడు మళ్లీ ఈటీవీలో కొత్త షో చేస్తున్నాడు. `ఫ్యామిలీ స్టార్స్` పేరుతో కొత్త షోని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మాస్‌ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్‌. మాస్‌ హీరో లెవల్‌లో సుధీర్‌ ఎంట్రీ ప్రోమో కట్‌ చేశారు.
 

58

ఇందులో సుడిగాలి సుధీర్‌ లుక్‌ అదిరిపోయింది. అంతేకాదు `ఆట చూస్తావా` అంటూ ఆయన చెప్పే విధానం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దుమ్ములేపేలా ఉంది. ప్రస్తుతం ఇది ట్రెండ్‌ అవుతుంది. అయితే మళ్లీ సుడిగాలి సుధీర్‌ బుల్లితెర ఎంట్రీ ఇవ్వడం, ఈటీవీలోనే షో చేయడం వెనుక కారణమేంటి? అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది.
 

68

సుడిగాలి సుధీర్‌ హీరోగా సినిమాలు బాగా ఆడుతున్నాయి, ఓటీటీలో ఆయనకు మంచి మార్కెట్‌ ఉంది అని అంతా భావించారు. అదే ఊపు కొనసాగుతుంది. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్‌ సడెన్‌గా మళ్లీ బుల్లితెరపైకి రావడం ఆశ్చర్యంగా మారింది. మరి మళ్లీ ఆయన ఎందుకు వచ్చాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి కారణాలేంటనేది చూస్తే..

78
Sudigali Sudheer

ప్రస్తుతం సుధీర్‌ `గోట్‌` చిత్రంలో నటించాడు. ఇది రిలీజ్‌ కావాల్సింది. కానీ ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయిందని సమాచారం. ఈ మూవీకి బిజినెస్‌ కాలేదట. ఓటీటీ కాలేదట. రిలీజ్‌ చేయలేని పరిస్థితుల్లో నిర్మాత ఉన్నారు. దీంతో సినిమాని పక్కన పెట్టారని సమాచారం. దీనికితోడు కొత్తగా ఆఫర్లు లేవని, కొన్ని కమిట్‌ మెంట్స్ ఉన్నా, ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి బాగా లేకపోవడంతో  ఇంకా పట్టాలెక్కడం లేదని తెలుస్తుంది. 
 

88

ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్‌ పెద్ద తెరకోసం స్ట్రక్‌ కావడం ఎందుకని చెప్పి, ఆయన మళ్లీ టీవీ షోస్‌ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే `సర్కార్‌ 4` షో చేస్తున్నాడు. ఇప్పుడు బుల్లితెరకి మళ్లీ రీఎంట్రీఇస్తూ ఈటీవీలో `ఫ్యామిలీ స్టార్స్` చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఇది సెలబ్రిటీల ఫ్యామిలీలకు సంబంధించిన షోనా అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories