ఢీ, జబర్దస్త్ అత్యధిక టీఆర్పీ దక్కించుకుంటున్న షోలుగా ఉన్నాయి. వాటి సక్సెస్ వెనుక సుధీర్, రష్మీ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మల్లెమాల నిర్మాణంలో తెరకెక్కే కొత్త కామెడీ షో అయినా, ప్రత్యేక ఈవెంట్ అయినా వీరిద్దరూ ఉండాల్సిందే. కాగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్నాళ్లుగా సుధీర్, రష్మీలను మల్లెమాల పక్కన పెడుతుంది.