ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే ఉత్కంఠ ఒకవైపు ఉంటే.. అసలు కథ ఏంటి, మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతోంది, లుక్ ఎలా ఉండబోతోంది అనే అంశాలు కూడా ఫ్యాన్స్ ని కుదురుగా ఉండనీయడం లేదు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు.. రాజమౌళి, మహేష్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 11 న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సుధీర్.. మహేష్, రాజమౌళి చిత్రం గురించి కామెంట్స్ చేశారు.