అదే సమయంలో ఇంటి ఓనర్ వచ్చి ఆరు నెలల నుంచి అప్పు డబ్బులు, అద్దె డబ్బులు రెండూ ఇవ్వటం లేదు రేపటికల్లా ఇస్తే సరే సరి లేదంటే ఇల్లు ఖాళీ చేయు అని బెదిరిస్తాడు. నా పరువు తీయొద్దు వ్యాపారం సరిగ్గా సాగటం లేదు ఒక నెల రోజులు గడువు ఇవ్వండి మొత్తం తీర్చేస్తాను అంటుంది బామ్మ. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎలా తీరుస్తావు అంటాడు ఓనర్.