వీర సింహారెడ్డి సినిమాలో మెరుపులా వచ్చి కుర్రాళ్ళ గుండెల్లో సూదులు గుచ్చి వెళ్లింది మాలీవుడ్ చిన్నది హీరోయిన్ హనీ రోజ్. ఒక్క సినిమాతోనే ఆమె యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం.