సాయి పల్లవి ఫ్యాన్స్ వరస ఫోన్ కాల్స్, కోర్టులో కేసు, రూ.1.1 కోట్ల డిమాండ్!

Published : Nov 22, 2024, 08:31 AM IST

శివ కార్తికేయన్, సాయిపల్లవి నటించిన అమరన్ సినిమా లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. సినిమాలో ఉపయోగించిన ఫోన్ నంబర్ వల్ల ఇబ్బంది పడుతున్నానని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపి, రూ.1.1 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు.

PREV
16
  సాయి  పల్లవి ఫ్యాన్స్ వరస ఫోన్ కాల్స్,  కోర్టులో కేసు,  రూ.1.1 కోట్ల డిమాండ్!
Sai Pallavi


శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran)మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్‌ నిర్మించారు. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. ముకుంద్ వర‌ద‌రాజ‌న్ (శివ కార్తికేయ‌న్‌), ఇందు రెబెకా వ‌ర్ఘీస్ (సాయిప‌ల్లవి) నటించారు.  ఈ సినిమా ఇప్పుడు ఓ లీగల్ సమస్యల్లో ఇరుక్కుంది. 
 

26
Siva karthikeyan, sai Pallavi, Amaran

అమరన్ సినిమా వల్ల తనకు ఇబ్బంది కలిగిందని పేర్కొంటూ విఘ్నేశన్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి చిత్ర టీమ్ కి లీగల్‌ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్స్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని  దీని వల్ల ఇబ్బందిపడుతున్నానని, మానసిక వేదనకు గురయ్యానని  పేర్కొన్నాడు. నష్టపరిహారంగా రూ.1.1 కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతం ఇది తమిళ పరిశ్రమలో చర్చకు దారి తీసింది.

36
Sai Pallavi


అమరన్ చిత్రంలోని ఒక సీన్ లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్‌ నంబర్‌ ఇస్తుంది. దీని కోసం చిత్ర టీమ్ ఒక నంబర్‌ ఉపయోగించింది. సినిమా విడుదలయ్యాక.. సాయిపల్లవి ఫోన్‌ నంబర్‌ అదేనని భావించిన పలువురు అభిమానులు కాల్స్‌ చేయడం మొదలుపెట్టారు.

సాధారణంగా ఫోన్‌ నెంబర్స్‌ చెప్పే సమయంలో మేకర్స్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని నెంబర్స్‌ మ్యూట్ చేయడం కానీ అందుబాటులో లేని నెంబర్స్‌ కానీ ప్రస్తావిస్తుంటారు. అయితే అమరన్‌ చిత్ర యూనిట్‌ మాత్రం నేరుగా నెంబర్‌ చెప్పేసింది.

46

అమరన్ సినిమాలో చూపించిన నంబర్‌ తనదేనని.. వరుస ఫోన్‌ కాల్స్‌, సందేశాల వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్‌ పేర్కొన్నాడు. దీనివల్ల తాను కుటుంబసభ్యులతో సరిగా సమయాన్ని గడపలేకపోతున్నానని చెప్పాడు. తన ఫోన్‌ నంబర్‌ ఉపయోగించినందుకు చిత్ర టీమ్ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరాడు.

56
Sai Pallavi


చిత్రం విషయానికి వస్తే... వాస్తవానికి నిజ జీవిత కథలను తెరకెక్కించటం చాలా కష్టం. అందులో డ్రామా తక్కువ ఉంటుంది. చెప్పటానికి చాలా ఉంటుంది. ఏది వదిలేయాలి, ఎక్కడ ఎమోషన్ వస్తుందో చూసుకుని ముందుకు వెళ్లాలనేది స్క్రిప్టు నుంచి పెద్ద టాస్క్,

ఏ మాత్రం తేడా వచ్చినా, కల్పన ఎక్కువైనా విమర్శలు వస్తాయి.  2014లో కాశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొంది, భారతదేశపు అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో గౌరవించబడ్డ గొప్ప సైనికుడు తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం “అమరన్” (Amaran). 

66
Sai Pallavi


అమరన్ పూర్తిగా సాయి పల్లవి చిత్రం. తెరపై శివకార్తికేయన్ సీన్స్ ఎక్కువ కనిపించినా, స్పైస్ మొత్తం సాయి పల్లవి లాగేసుకుంది. తన నటనతో రెబెక్కా వర్గీస్ పాత్రకు ప్రాణం పోసింది. ఇంకొకరు ఈ పాత్రను చేస్తే ఈ స్దాయిలో అయితే చేయలేరు అనేంతగా జీవించింది.

శివకార్తికేయన్ ఈ పాత్ర కోసం పడిన కష్టం,తాపత్రయం, బాడీ లాంగ్వేజ్ ఆశ్చర్యపరుస్తాయి. ఇన్నాళ్లూ కామెడీకే పరిమితమైన శివకార్తికేయన్ ఈ సినిమాతో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు.  ఆర్మీ చీఫ్ గా రాహుల్ బోస్ (Rahul Bose) ,సైనికుడిగా భువన్ అరోరా (Bhuvan Arora) గుర్తుండిపోతారు.  తల్లి పాత్రలో గీతా కైలాసం కూడా మనం థియటర్ నుంచి బయిటకు వచ్చాక కూడా గుర్తుకు వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories