జీబ్రా మూవీ ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ మూవీకి షాకింగ్ రెస్పాన్స్, సినిమాకు హైలెట్ అదే!

First Published | Nov 22, 2024, 6:37 AM IST

హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ జీబ్రా. ఈ మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది. మరి జీబ్రా మూవీ చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఏమిటో చూద్దాం 
 

సత్యదేవ్ స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తూనే హీరోగా కొనసాగుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన ఆచార్య, గాడ్ ఫాదర్, రామ్ సేతు వంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. హీరోగా ఆయనకు బ్రేక్ రావడం లేదు. చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావడం లేదు. హీరోగా ఆయన నటించిన గత రెండు చిత్రాలు గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ నిరాశపరిచాయి. 

ఈసారి ఆయన క్రైమ్ థ్రిల్లర్ ఎంచుకున్నారు. జీబ్రా టైటిల్ తో సత్యదేవ్ నటించిన చిత్రం నవంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ మూవీ ప్రేమియర్స్ ముగిశాయి. ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా జీబ్రా మూవీ ఎలా ఉందో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 

ఈ చిత్రంలో సత్యదేవ్ బ్యాంకు ఎంప్లాయ్ రోల్ చేశారని తెలుస్తుంది. మరో ప్రధాన పాత్ర చేసిన పుష్ప ఫేమ్ ధనుంజయ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారట. ఈ రెండు పాత్రలు నెగిటివ్ షేడ్స్ తో కూడుకుని ఉంటాయట. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను అడ్డుపెట్టుకుని ఎలా దోపిడీ చేశారనేది కథ అని ఆడియన్స్ కామెంట్స్ ద్వారా అర్థం అవుతుంది. 


జీబ్రా చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడట. కథలో వచ్చే ట్విస్ట్స్ అలరిస్తాయట. టైట్ స్క్రీన్ ప్లే, ఆసక్తి రేపే సన్నివేశాలతో జీబ్రా సాగుతుందట. అసలు దొంగ ఎవరు అనే ట్విస్ట్ చివరి వరకు కొనసాగుతుందట. డైరెక్షన్, రైటింగ్ బాగుంది అనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. 

సత్యదేవ్, ధనుంజయ అద్భుతంగా నటించారు. వారిద్దరి పాత్రల మధ్య సంఘర్షణ బాగుందని అంటున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు అవి ప్లస్ అంటున్నారు. ఈ మూవీలో లోపాలను కూడా ఆడియన్స్ ఎత్తి చూపుతున్నారు. మ్యూజిక్ ఏమంత రంజుగా లేదని అంటున్నారు. సాంగ్స్, బీజీఎమ్ నిరాశపరిచాయన్న వాదన వినిపిస్తోంది. 

జీబ్రా చిత్రానికి కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే సత్యరాజ్ వంటి నటుడిని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. అది నిరాశపరిచే అంశం అంటున్నారు. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న దర్శకుడు కొన్ని చోట్ల లాజిక్ మర్చిపోయాడని అంటున్నారు. 

బ్యాంకింగ్ సెక్టార్ లో పని చేసిన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తన అనుభవాల ఆధారంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపుతూ ఈ చిత్రం తెరకెక్కించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, దోపిడీ సన్నివేశాలు, ట్విస్ట్స్ మూవీకి ప్రధాన బలం అంటున్నారు. మొత్తంగా సత్యదేవ్ కి హిట్ పడిందని అంటున్నారు. 

జీబ్రా మూవీలో ప్రియా భవాని శంకర్, అమృత ఐయ్యంగార్ హీరోయిన్స్ గా నటించారు. సునీల్ ఓ కీలక రోల్ చేశాడు. బాల సుందరం, దినేష్ సుందరం, ఎస్ ఎం రెడ్డి నిర్మించారు. 

Latest Videos

click me!