బాబాయ్ ని పబ్లిక్ గా రిక్వస్ట్ చేశాడు, చివరికి తానే పూర్తి చేశాడు..దటీజ్ జూనియర్ ఎన్టీఆర్ 

First Published | Nov 22, 2024, 7:50 AM IST

కొమరం భీమ్ చిత్రాన్ని కూడా చాలా మంది తెరకెక్కించాలని ప్రయత్నించారు. కొమరం భీమ్ పై కొన్ని చిత్రాలు వచ్చాయి. అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. 

అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని సీనియర్ ఎన్టీఆర్ చేద్దాం అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ ఆ చిత్రంలో నటించి చరిత్ర సృష్టించారు. కృష్ణ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా అల్లూరి పాత్ర గురించి మాట్లాడకుండా ఉండలేం. అదే విధంగా కొమరం భీమ్ చిత్రాన్ని కూడా చాలా మంది తెరకెక్కించాలని ప్రయత్నించారు. కొమరం భీమ్ పై కొన్ని చిత్రాలు వచ్చాయి. అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. 

రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి, కొమరం భీం పాత్రలతో ఫిక్షనల్ స్టోరీ క్రియేట్ చేసి వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రదర్శించిన నటన అద్భుతం అనే చెప్పాలి. గతంలో కొమరం భీమ్ చిత్రంలో నటించాలని కొంతమంది స్టార్ హీరోలకు ప్రపోజల్స్ వెళ్లాయి. వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. 


బాలకృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో పరమవీర చక్ర అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ఆడియో లాంచ్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. లెజెండ్రీ డైరెక్టర్ బాలచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఈ ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్ర ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు. 

ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ బాలయ్యని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణరావు గారు బాబాయ్ ని ఈ చిత్రంలో రావణాసురిడి గెటప్ పది తలలతో చూపించారు. బాబాయ్ ని అలా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు.. దేవుడు 10 కళ్ళు ఇచ్చి ఉంటే బావుండేది అనిపించింది. అలాగే కొమరం భీమ్ గెటప్ లో చూపించారు. బాబాయ్ ని అలా చూడగగానే.. అర్జెంట్ గా వీళ్లిద్దరి కాంబినేషన్ లో కొమరం భీం అనే చిత్రం రావాలని కోరుకుంటున్నా. 

ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు. బాబాయ్ కొమరం భీం చిత్రంలో నటిస్తే కనుల పండుగలా ఉంటుంది. ఆయా కోరిక త్వరగా తీరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ ఎన్టీఆర్ తెలిపారు. కొమరం భీమ్ పాత్రలో నటించాలి అని బాలయ్యని రిక్వస్ట్ చేశాడు. యాదృచ్చికమో ఏమో కానీ బాలయ్య కొమరం భీంగా నటించలేదు.. కానీ చివరికి జూనియర్ ఎన్టీఆర్ తానే పూర్తి స్థాయిలో కొమరం భీమ్ పాత్రలో నటించి అదరగొట్టాడు. ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ భీమ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భీం పాత్రలో నటినకి ఫిదా కాని వారు అంటూ ఉండరు. ఆ విధంగా బాబాయ్ ని కొమరం భీం చిత్రంలో నటించమని రిక్వస్ట్ చేసిన తారక్ చివరికి తానే ఆ పని పూర్తి చేశాడు. 

Latest Videos

click me!