వరుణ్ తేజ్-లావణ్య నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్? మెగా హీరోల సమక్షంలో అంగరంగ వైభవంగా!

Sambi Reddy | Updated : Jun 01 2023, 11:36 AM IST
Google News Follow Us

హీరో వరుణ్ తేజ్ వివాహానికి రంగం సిద్దమైందట. తన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయనున్నారట. నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారట. 

15
వరుణ్ తేజ్-లావణ్య నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్? మెగా హీరోల సమక్షంలో అంగరంగ వైభవంగా!
Varun Tej- Lavanya Tripathi


హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తున్నారనే రూమర్ చాలా కాలంగా ఉంది. పెళ్లి వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు ముహూర్తం కుదిరిందన్న సమాచారం అందుతుంది. ప్రముఖ బాలీవుడ్ మీడియా పింక్ విల్లా కథనం ప్రకారం... జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందట. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. వధూవరుల దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారట. 
 

25
Varun Tej- Lavanya Tripathi

ఈ నిశ్చితార్థం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారట. నిహారిక వివాహం అనంతరం మెగా హీరోలందరూ ఒక్కచోట చేరనున్నారట. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిశ్చితార్థం వేడుకకు ఆహ్వానం ఉందట. పెళ్లి మాత్రం ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా చేయనున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. 
 

35
Varun Tej- Lavanya Tripathi


లావణ్య-వరుణ్ జంటగా మిస్టర్ మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలు అందుకోలేదు. అయితే వీరి పరిచయం ప్రేమకు దారి తీసిందట. ఏడాది కాలంగా వరుణ్, లావణ్య వివాహ వార్త హాట్ టాపిక్ గా ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో లావణ్య ఈ వార్తలను ఖండించారు. 

Related Articles

45

కాగా లావణ్య త్రిపాఠి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.  ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా సక్సెస్ కాలేదు. జీ 5లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్లో లావణ్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం విశేషం. అలాగే ఆమె చివరి చిత్రం హ్యాపీ బర్త్ డే సైతం నిరాశపరిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది.

55


ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తో మరో చిత్రం చేస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
 

Read more Photos on
Recommended Photos