ఓ ఇంటివాడైన ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. వధూవరులను ఆశీర్వదించిన గురువు సుకుమార్.. ఫొటోలు

First Published | Jun 1, 2023, 11:25 AM IST

‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  ఓ ఇంటివాడయ్యాడు. ఆయన పెళ్లి వేడుక సొంతూరిలోనే ఘనంగా జరిగింది. డైరెక్టర్ సుకుమార్ తో పాటు పలువురు వివాహానికి హాజరై ఆశీర్వదించారు. ప్రస్తుతం ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

సుకుమార్ శిష్యుడు, ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పెళ్లి వార్త అలా వచ్చిందో లేదో ఇలా పెళ్లి మండపంలో దర్శనమిచ్చారు. ఎట్టకేళలకు శ్రీకాంత్ ఓ ఇంటివాడయ్యాడు. మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కడంతో శ్రీకాంత్ ఓదెలను పలువురు సినీ సెలబ్రెటీలు, ఆయన స్నేహితులు, అభిమానులు విష్ చేస్తున్నారు. 
 

దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్  ఏ సినిమా చేయబోతున్నాడు..  ఎవరితో మూవీ రాబోతుందనే చర్చ నడుస్తుండగా.. ఉన్నట్టుండి పెళ్లి మేటర్ తో అందరికీ షాకిచ్చాడు. మొన్నటి వరకు ‘పుష్ప2’ షూటింగ్ లో ఉన్న శ్రీకాంత్ తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించారు. ఆయన పుట్టిపెరిగిన ఊరులోనే పెళ్లి ఘనంగా జరిగింది.
 


కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో శ్రీకాంత్ ఓదెల వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)  వీరి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మ్యారేజ్ కు సుక్కు  స్పెషల్ గెస్ట్ గా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పలువురు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా వేడుకలో మెరిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

అయితే, శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి వివరాలు ఏమీ తెలియరాలేదు. తమ బంధువుల అమ్మాయనే అంటున్నారు. ఏదేమైనా శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటివాడు అవడంతో సంతోషిస్తున్నారు. శ్రీకాంత్ దర్శకత్వంలో నాని - కీర్తి సురేష్ జంటగా వచ్చిన ‘దసరా’ చిత్రం ఎంతటి బ్లాక్ బాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 
 

Latest Videos

click me!