Samantha: జ్ఞాపకాలు చెరిపేసినా సమంత ఒంటిపై నాగ చైతన్య గుర్తులు చెరిగిపోలేదు.. మరి వాటినేమి చేస్తుంది!

First Published | Nov 19, 2021, 3:30 PM IST


ఇప్పుడు నాగ చైతన్య సమంత ఎవరికీ ఎవరూ ఏమీ కారు. ఇద్దరి ప్రపంచాలు వేరు, జీవితాలు వేరు. దాదాపు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన ఈ లవ్లీ కపుల్, అనూహ్యంగా విడిపోయారు. 

samantha

సమంత (Samantha) -చైతు విడాకులు చాలా మందిని ఇబ్బంది పెట్టాయి. ఈ ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న ఇమేజ్ రీత్యా విడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కారణం ఏదైనా కానీ, సర్దుకుపోయి, కలిసి ఉంటే బాగుండేదని భావించారు. మనస్పర్థలు వచ్చినప్పుడు.. ఎవరు చెప్పినా వినడం జరగదు. 


వీరి మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసి ఇరు కుటుంబాల పెద్దలు సంధి కుదిర్చే ప్రయత్నాలు చేశారు. అయితే మొండి పట్టుదలతో ఉన్న సమంత, చైతూ విడిపోవడానికే మొగ్గు చూపారు. భవిష్యత్ లో కలిసేది లేదని ఖరాఖండిగా చెప్పారు. కనీసం ఈ నాలుగేళ్లలో పిల్లలు పుట్టి ఉంటే, వాళ్ళ కోసం అయినా, ఒక్కటయ్యేవారు. 
 


మరోవైపు సమంత నాగ చైతన్య (Naga chaitanya) జ్ఞాపకాలు మెదడు నుండి చెరిపివేసే ప్రయత్నంలో ఉన్నారు. దాని కోసం ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తో విహార, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో గోవా, డెహ్రాడూన్, చార్ ధామ్ యాత్ర చేశారు. అనంతరం దుబాయ్ టూర్ కి వెళ్లడం జరిగింది. 

కాగా నాగ చైతన్యను మరిచిపోయే పనిలో భాగంగా సమంత ఇంస్టాగ్రామ్ లో ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తొలగించారు. దాదాపు 80 ఫోటోలు వరకు చైతూకి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం జరిగింది. 

జ్ఞాపకాలు, ఫోటోలు తుడిచేస్తున్న సమంత తన శరీరంపై ఉన్న చైతూ గుర్తులు అలానే ఉంచుకున్నారు. సమంత ఒంటిపై మొత్తం మూడు టాటూలు ఉన్నాయి . ఆ మూడు నాగ చైతన్యతో లింక్ ఉన్నవే. చేతిపై సమంత, నాగ చైతన్య ప్రేమకు గుర్తుగా బాణం సింబల్ లో టాటూలు వేయించుకున్నారు. 
 


అలాగే సమంత కుడి చెస్ట్ క్రింద నాగ చైతన్య పేరు టాటూగా ఉంది. అలాగే వీపుపై 'వై ఎం సి'  అనే లెటర్స్ ఉన్నాయి. ఈ టాటూ సమంత మొదటి చిత్రం ఏమాయ చేశావే.. కి షార్ట్ ఫార్మ్. ఈ టాటూలు ఇంకా ఆమె శరీరం మీద ఉన్నాయి. మూడు టాటూలు నాగ చైతన్య గుర్తులు. ఈ టాటూలు సమంత తొలగించారని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అది నిజం కాదని తేలింది

తాజాగా జిమ్ ఫిట్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న సమంత.. వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో సమంత వీపు భాగంపై టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. 

Samantha

ఇక ఆ విషయాలు అటుంచితే కెరీర్ లో బిజీ అవుతుంది సమంత. ఆమె హీరోయిన్ గా పలు చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇక కేరీర్ మొదటిసారి ఐటెం భామగా గా కూడా మారుతుంది. అల్లు అర్జున్ (Allu arjun) పుష్ప (Pushpa) చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేయనున్నారు.

Also read Samantha:ఐటెం సాంగ్ కోసం అన్ని కోట్లా... సమంతకు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన పుష్ప మేకర్స్!

Also read Pan India Heroines: రష్మిక, సమంత, పూజా, తమన్నా, కాజల్‌, రకుల్‌.. పాన్‌ ఇండియా లెవల్‌లో రచ్చ

Latest Videos

click me!