అలాంటి బయోపిక్ లో నటించాలని ఉంది, త్వరలో పోలీస్ అధికారిగా.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

First Published | Aug 15, 2024, 11:31 PM IST

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం చిత్రం ఆగష్టు 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నాని ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో నానికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం చిత్రం ఆగష్టు 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నాని ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో నానికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు ఇంతవరకు పోలీస్ అధికారిగా నటించలేదు. 

పోలీస్ పాత్రలో ఎప్పుడు కనిపిస్తారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నాని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సరిపోదా శనివారం రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత నా కొత్త చిత్రం ప్రకటించబోతున్నాను. ఆ చిత్రంలో నేను పోలీస్ గానే నటిస్తున్నాను అంటూ రివీల్ చేశారు. 


అంటే నానిని త్వరలో పోలీస్ పాత్రలో చూడబోతున్నాం. స్వాతంత్ర నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటిస్తారా అని కూడా ప్రశ్న ఎదురైంది. అలాంటి చిత్రాల్లో నటించాలని నాకు కూడా ఉంది. 

అయితే ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ చిత్రం అయితే వెంటనే ఒకే చేస్తా. ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ తో నా దగ్గరకి వస్తే హ్యాపీ అంటూ నాని సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పై సినిమాలు వచ్చాయి. మరి నాని ఎవరి పాత్రలో నటించాలని అనుకుంటున్నాడో.. 

Latest Videos

click me!