ఒక్క సాంగ్ కు అంతా రేటా..? మడతపెట్టేస్తున్నాడు శేఖర్ మాస్టర్.. రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడంటే..?

First Published Jan 18, 2024, 3:21 PM IST

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే.. స్టార్ హీరోలకు కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆయన రంగంలోకి దిగితే ఏదో ఒక సిగ్నేచర్ స్టెప్ వస్తుంది. తాజాగా కుర్చి మడతపెట్టి సాంగ్ చూశారుగా. ఇక స్టార్ హీరోలకు ఎనర్జీ నింపే శేఖర్ మాస్టర్.. కొరియోగ్రఫీ చేస్తే ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..?
 

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలతో సిగ్నేచర్ స్టెప్పులేయించాడు శేఖర్ మాస్టార్. రీంసెంట్ గా గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి  శేఖర్ మాస్టర్ చేసిన మ్యాజిక్ తెలిసిందే..? అంతే కాదు.. ఇప్పటికీ పలు  టీవీ షోలకు, డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ ఏదైనా పెద్ద సినిమా తెరకెక్కుతోందంటే.. కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ఉండాల్సిందే. 
 

స్టార్ హీరోలు సైతం శేఖర్ మాస్టర్ తో కలిసి వర్క్ చేయాలనుకుంటారు. డాన్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని మహేష్ బాబుతో కూడా కుర్చీ మడతపెట్టించాడు శేఖర్ మాస్టర్.యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ.. రామ్ చరణ్ నుంచి.. మెగాస్టార్ వరకూ.. శేఖర్ మాస్టర్ స్టెప్పులకు ఫిదా అవ్వాల్సింది. మరి ఇంత స్టార్ డమ్ తో దూసుకుపోతోన్న శేఖర్ మాస్టర్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..? 
 

ఇటు సినిమాలు అటు పెద్ద పెద్ద తారల ఇంట్లో సంగీత్ వేడుకలు.. అటు టీవీ షోలు.. ఏది వదిలిపెట్టకుండా.. దున్నేస్తున్నాడు శేఖర్ మాస్టర్.. స్టార్ హీరోల సినిమాలకు ఆయన దాదాపు 50 లక్షల నుంచి కోటి వరకూ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ రెండు మూడు పాటలు కంపోజ్ చేస్తే.. ఆయనకు 2 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుతుందని సోషల్ మీడియా సమాచారం. ఇక శేఖర్ మాస్టర్ సంగీత్ లుకూడా చేస్తారు అని అంటున్నాడు అతని పాత గురువు బషీర్ మాస్టర్. 
 

శేఖర్ మాస్టర్ రెండో గురువు బషీర్ మాస్టర్ వెల్లడించినట్టుగావస్తున్న వార్తల ప్రకారాం... తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. తాను ఆన్లైన్ క్లాసెస్ కనుక నిర్వహిస్తే 30 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాను.. అంటూ బషీర్ మాస్టర్ వెల్లడించారు. ఇక ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందినటువంటి శేఖర్ మాస్టర్ ఏదైనా ఒక సంగీత్ వేడుకకు కొరియోగ్రఫీ కనుక చేస్తే సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు తీసుకుంటారట. 
 

అయితే సంగీత్ లకు శేఖర్ మాస్టర్ శిష్యులే ఎక్కువ వర్క్ చేస్తారు.. ఆయన పర్వావేక్షణ మాత్రం చేస్తాడట. శేఖర్ మాస్టర్ మాత్రమే కాకుండా జానీ మాస్టర్, సత్య మాస్టర్ సందీప్ మాస్టర్ వంటి వారందరూ కూడా సంగీత్ వేడుకలు చేసిన వారేనని ఈయన వెల్లడించారు. ఇక సందీప్ మాస్టర్ మొన్నటి వరకు ఒక్కో సంగీత్ వేడుకకు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని బషీర్ మాస్టర్ అన్నట్టు తెలుస్తోంది. 
 

sekhar master

ఇక ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఇమేజ్ రావడంతో.. పెద్ద పెద్ద సంగీత్ లను కూడా శేఖర్ మాస్టర ఒప్పుకోవడం లేదని.. ఒక వేళ ఒప్పుకున్నా శేఖర్ మాస్టర్ శిష్యులు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
 

click me!