ఇష్టం వచ్చింది చేస్తా మీకేంటి సమస్య... ట్రోలర్స్ పై మండిపడ్డ ఇనయ సుల్తానా!

Published : Jan 18, 2024, 03:19 PM IST

ఇనయ సుల్తానా వేణు స్వామిని కలిసిన ఫోటోలు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వీటిని కొందరు ట్రోల్ చేశారు. దీంతో ఇనయ సుల్తాన మండిపడ్డారు. ట్రోలర్స్ పై మండిపడింది...   

PREV
16
ఇష్టం వచ్చింది చేస్తా మీకేంటి సమస్య... ట్రోలర్స్ పై మండిపడ్డ ఇనయ సుల్తానా!
Inaya Sulthana

ఇనయ సుల్తానా బిగ్ బాస్ షో వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి ముందు వారం ఎలిమినేట్ అయ్యింది. ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. ఇనయ బోల్డ్ గేమ్ ఆడింది. హౌస్లో ఎఫైర్ నడిపింది. మొదట్లో విమర్శలపాలైన ఇనయ మెల్లగా అభిమానులను సంపాదించుకుంది. 

 

26
Inaya Sulthana

ఇనయ సుల్తానా ఫేట్ బిగ్ బాస్ మార్చేస్తుందని కొందరు భావించారు. కానీ అలా జరగలేదు. అటు బుల్లితెర మీద కానీ ఇటు వెండి తెర మీద కానీ ఆమెకు ఆఫర్స్ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్ షూట్స్ తో నెటిజెన్స్ గుండెల్లో సెగలు రేపుతోంది. 

36
Bigg Boss fame Inaya Sulthana

సడన్ గా ఆమె వేణు స్వామితో కనిపించారు. ఆయనతో దిగిన ఫోటోలు, పూజలు జరిపించుకున్న వీడియో షేర్ చేసింది. వేణు స్వామి బర్త్ డే నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పి అభిమానం చాటుకుంది. అయితే ఈ ఫోటోలు ట్రోల్స్ కి గురయ్యాయి. 
 

46

వేణు స్వామి జాతకం పేరుతో స్టార్ హీరోల మీద నెగిటివ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో  వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇతడంటే కొందరికి నచ్చదు. అలాగే వేణు స్వామి అంటే ఫేక్ అనే భావన కూడా కొందరిలో ఉంది. ఈ క్రమంలో ఇనయ సుల్తానాను ట్రోల్ చేస్తున్నారు.

 

56

వేణు స్వామి పూజలతో స్టార్ హీరోయిన్ అయిపోతావా? ఇలాంటి మూఢనమ్మకాలు ఎలా నమ్ముతారు? అయితే ఆ వేణు స్వామి పెద్ద ఫ్రాడ్. అతన్ని నమ్మకు. అయినా ముస్లిం అమ్మాయివి అయ్యుండి... ఆ పూజలు ఏంటీ? అని వరుస కామెంట్స్ తో దాడికి దిగారు. 

 

66

ఈ ట్రోల్స్ పై ఇనయ సుల్తానా స్పందించింది. నేను భారతదేశంలో పుట్టాను. నాకు ఇష్టం వచ్చినపని చేసే స్వేచ్ఛ నాకు ఉంది. అసలు మీకేంటి సమస్య? అని కౌంటర్ కామెంట్స్ చేసింది. ఇనయ ట్రోలర్స్ పై మండిపడ్డారు. తన చర్యలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని పరోక్షంగా తెలియజేసింది.

 

Read more Photos on
click me!

Recommended Stories