బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా కొనసాగింది. 15 వారాలు బిగ్ బాస్ షో ను చాలా డిఫరెంట్ గా రన్ చేశారు నిర్వాహకులు. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడిచింది. అయితే చివరివారం మాత్రం చాలా చప్పగా టేస్ట్ లెస్ గా తయారయ్యింది.
అంతే కాదు చివరివారం హోరాహోరిగా టాస్క్ లు ఉంటాయి అనుకుంటే.. ఏదో జరగలేదు అన్నట్టుగా జరిపేస్తున్నాడు బిగ్ బాస్. సీజన్ అంతా లిమిట్ లెస్ ట్విస్ట్ లు.. అద్భుతమైన టాస్క్ లు, ఎన్నో జ్ఞాపకాలతో కొనసాగగా.. ఫైనల్ ఫ్రోగ్రామ్ ను చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశారు.