స్టార్ లేడీ రష్మిక మందాన సరికొత్త లుక్... పరువాల ప్రదర్శనలో తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి!

Published : Jun 23, 2023, 03:38 PM IST

ఓ బ్రాండ్ ప్రమోషన్ షూట్ లో మెరిసింది రష్మిక మందాన. ఈ స్టార్ లేడీ సరికొత్త లుక్ వైరల్ అవుతుంది. నిండైన బట్టల్లో కూడా పరువాల ప్రదర్శన ఆపలేదు.   

PREV
15
స్టార్ లేడీ రష్మిక మందాన సరికొత్త లుక్... పరువాల ప్రదర్శనలో తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి!
Rashmika Mandanna


జనస్య అనే గార్మెంట్ బ్రాండ్ ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంది. ఈ సందర్భంగా సదరు బ్రాండ్ బట్టల్లో మెరిసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా నయా లుక్ షేర్ చేసింది. 
 

25
Rashmika Mandanna


జయాపజయాలతో సంబంధం లేకుండా రష్మిక దూసుకుపోతుంది.  చెప్పాలంటే ఏడాది కాలంగా రష్మిక ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సీతారామం విజయం సాధించినా ఆ మూవీ క్రెడిట్ మృణాల్ కొట్టేసింది. ఆడవాళ్లు మీకు జోహార్లు డిజాస్టర్ కాగా, హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను నిరాశపరిచాయి. ఇక విజయ్ కి జంటగా నటించిన భారీ చిత్రం వారసుడు మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఆ చిత్రంలో రష్మిక పాత్ర జస్ట్ సోసో గా ఉంటుంది. వారసుడు చిత్ర కథలో రష్మిక పాత్ర దర్శకుడు పాటలకే పరిమితం చేశాడు.
 

35
Rashmika Mandanna


ఇటీవల రష్మిక రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. వెంకీ కుడుముల రష్మిక ఫేవరెట్ డైరెక్టర్. ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. ఛలో మూవీతో రష్మిక బోణీ అదిరిపోగా స్టార్ హీరోయిన్ గా అవతరించింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.అలాగే రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా అంటున్నారు. ఆల్రెడీ రైన్ బో షూటింగ్ జరుపుకుంటుంది. 
 

45
Rashmika Mandanna


ఇక రష్మిక ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ ల చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు నిదర్శనం. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తుంన్నారు. 2023 డిసెంబర్ లో విడుదల కానుందని సమాచారం. అలాగే పుష్ప 2లో రష్మిక పాత్ర చనిపోతుందట. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

55
Rashmika Mandanna

ఇక బాలీవుడ్ లో జెండా పాతాలని కొన్నాళ్లుగా రష్మిక గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆమె నటించిన హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను నిరాశపరిచాయి. దీంతో యానిమల్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు చేసిన సందీప్ రెడ్డి నుండి వస్తున్న యానిమల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 

click me!

Recommended Stories