Manu Charitra Review: `మను చరిత్ర` సినిమా రివ్యూ, రేటింగ్‌.. శివ కందుకూరి మెప్పించాడా?

First Published | Jun 23, 2023, 2:02 PM IST

ప్రముఖ నిర్మాత `పెళ్లి చూపులు` ఫేమ్‌ రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన చిత్రం `మను చరిత్ర`.  మేఘా ఆకాష్‌, ప్రగతి శ్రీవాత్సవ్‌, ప్రియా వడ్డమాని హీరోయిన్లుగా నటించారు. భరత్‌ పెదగాని దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, పి రోన్సన్‌ నిర్మించారు. నేను శుక్రవారం(జూన్‌ 23) ఈ చిత్రం విడుదలైంది. నిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

ప్రముఖ నిర్మాత `పెళ్లి చూపులు` ఫేమ్‌ రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. లవ్‌ స్టోరీస్‌, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తే నటుడిగా నిరూపించుకుంటున్నాడు. ఈ సారి లవ్‌తోపాటు యాక్షన్ ట్రై చేశాడు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన `మను చరిత్ర` అనే చిత్రంలో హీరోగా నటించాడు. మేఘా ఆకాష్‌, ప్రగతి శ్రీవాత్సవ్‌, ప్రియా వడ్డమాని హీరోయిన్లుగా నటించారు. ధనంజయ్‌, సుహాస్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్, మధుసూధన్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భరత్‌ పెదగాని దర్శకత్వం వహించారు. గోపీసుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యాపిల్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, పి రోన్సన్‌ నిర్మించారు. నేను శుక్రవారం(జూన్‌ 23) ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
వరంగల్‌ టౌన్‌ నేపథ్యంగా జరిగే కథ. మను(శివకందుకూరి) శ్రావ్య(ప్రియా వడ్లమాని) ని ప్రేమిస్తాడు. ఆమెకోసం దెబ్బలు కూడా తింటాడు. ఆమె అతని ప్రేమని యాక్సెప్ట్ చేసి తిరిగి ఐ లవ్యూ చెప్పాక బ్రేకప్‌ చెబుతాడు. ఇలా వరుసగా  చాలా మంది అమ్మాయిల వెంటపడటం, వాళ్లు ఐ లవ్యూ చెప్పగానే బ్రేకప్‌ చెప్పడం కామన్‌ అవుతుంది. ఇలా అమ్మాయిలను మోసం చేసినందుకు బుద్ది చెప్పాలని శ్రావ్య.. మరో అమ్మాయితో కలిసి ఓ ప్లాన్‌ చేస్తుంది. కొత్తగా ప్రేమించిన అమ్మాయికి బ్రెయిన్‌ ట్యూమర్‌ అని, 25 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతుంది. దీంతో ఆమె కోసం రౌడీ షీటర్‌ రుద్ర(ధనంజయ్‌) వద్ద పనిచేసేందుకు ఒప్పుకుంటాడు. తీరా చెక్‌ చేస్తే ఆ అమ్మాయికి బ్రెయిన్‌ ట్యూమర్‌ లేదని తేలుతుంది. ప్రేమించి మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేందుకు ఇలా చేసినట్టు శ్రావ్య చెబుతుంది. దీంతో అప్పుడు మను ఫ్రెండ్‌(సుహాస్‌) అసలు నిజం చెబుతాడు. ఫ్లాష్‌ బ్యాక్‌లో జెన్నీ(మేఘా ఆకాష్‌)తో ప్రేమ కథ రివీల్‌ అవుతుంది. మరి జెన్నీ.. మను నుంచి ఎలా దూరమైంది? జెన్నీ కారణంగా నరకం అనుభవించిన మను దాన్నుంచి బయటపడ్డాడా? లేదా? తాను అనుకున్న ప్రేమని పొందాడా? లేదా? అతను లైఫ్‌ ఎలాంటి టర్న్ లు తీసుకుంది? వరంగల్‌ పరిధిలో జరిగే వరుస మిస్సింగ్‌ కేసులకు కారణం ఏంటి? అనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః 
యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీ ఇది. కేవలం లవ్‌ స్టోరీ అయితే రొటీన్‌ అవుతుంది. అందుకే దీనికి పొలిటికల్‌ అంశాలు, దాని రిలేటెడ్‌ యాక్షన్‌ క్రైమ్ ని బ్యాక్‌ డ్రాప్‌గా ఎంచుకున్నారు. దీంతో ఇందులో `ఆర్‌ఎక్స్ 100`, `అర్జున్‌రెడ్డి` స్టయిల్‌ కనిపిస్తుంది. సినిమా ప్రారంభాన్ని డిఫరెంట్‌గా తీసుకెళ్లాడు. దీంతో సినిమాలో ఏం జరుగుతుంది? హీరో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడనేది ఆడియెన్స్ కి సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. ఏదో ఉందనే ఉత్సుకతని కలిగిస్తుంది. గుడి వద్ద అమ్మాయిని చూసి ఇష్టపడటం, ఐ లవ్యూ చెప్పడం ఎప్పుడో చూసేసినా, ఇందులో దాన్ని నడిపించిన తీరు కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మేఘా ఆకాష్‌తో లవ్‌ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇద్దరి ప్రేమని పెద్దవాళ్లకి చెప్పడం, వాళ్లు కన్విన్స్ అవ్వడం, ఇక లైఫ్‌లో అంతా హ్యాపీ అనుకునే సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు, ఎదురైన ట్విస్ట్ లు ఉత్కంఠ క్రియేట్‌ చేస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. 
 

సెకండాఫ్‌ మొత్తం ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో మను పడే బాధ, సంఘర్షణ ఆడియెన్స్ ని కదిలిస్తుంది. మొదటి భాగం అంతా దీని చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో మను రౌడీయిజంలోకి దిగడం, వరంగల్‌ మేయర్‌ అనుచరుడు రుద్ర వద్ద పనిచేయడం, ఈ క్రమంలో వరుసగా క్రైమ్‌లో భాగమవడం, ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే లవ్ కొనసాగడం వంటి సన్నివేశాలతో రొటీన్‌గా మారుతుంది. అదే సమయంలో కొంత ల్యాగ్‌ అనిపిస్తుంది. సినిమాలో వినోదానికి స్కోప్‌ ఉన్నా ఆ దిశగా పెద్దగా ఫోకస్‌ పెట్టలేదనిపిస్తుంది. దీనికితోడు సీన్లని సాగదీస్తూ, కొన్ని సీన్లు రీపీటెడ్‌గా చూపించడం సినిమాకి మైనస్‌గా మారాయి. ఆడియెన్స్ ని ఆ ఫ్లో నుంచి డైవర్ట్ చేసేలా చేస్తాయి. మరోవైపు సినిమాలో ఎమోషన్స్ పై మరింత ఫోకస్‌ చేయాల్సింది. లవ్‌లో బాధ వంద శాతం తెరపై ఆవిష్కరణ కాలేదనిపిస్తుంది. దీంతో ఏదో కొంత లోటు కనిపిస్తుంది. అయితే ఓ వైపు లవ్‌, మరోవైపు యాక్షన్‌ సమాంతరంగా నడిపిన విధానం బాగుంది. దీంతో రొటీన్‌ లవ్‌ స్టోరీ అనే ఫీలింగ్‌ని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ ఆ విషయంలో పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయారు. ఇదిలా ఉంటే లవ్‌ ఫెయిల్యూర్‌తో హీరో పడే బాధలు..  `అర్జున్‌రెడ్డి`లో విజయ్‌ దేవరకొండని, `ఆర్‌ఎక్స్ 100`లో కార్తికేయను గుర్తు చేస్తుంటాయి. కొంత వారి మ్యానరిజం ఫాలో అయ్యినట్టుగా అనిపిస్తుంది. 
 

అయితే సినిమాలో డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. లవ్‌ సీన్లు బాగున్నాయి. కథని సీరియస్‌గా నడిపించే సీన్లు ఆకట్టుకున్నాయి. కానీ ల్యాగ్‌, సినిమా నిడివి మైనస్‌ అని చెప్పాలి. వాటిని తగ్గించాల్సింది. కాస్త క్రిస్పీగా చేస్తే సినిమా ఫాస్ట్ గా సాగేది. దీంతో ఆడియెన్స్ డైవర్ట్ కాకుండా ఉండేది. అయితే ఇందులో పొలిటికల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌కి సంబంధించి మంచి సందేశాన్నిచ్చింది. ఏ రాజకీయ నాయకుడైనా తన కింద పనిచేసే వాడిని పనోడిలాగే చూస్తాడు. తనలా ఎదగాలని చూడరని, కేవలం రౌడీయిజాన్ని తన పదవి కాపాడుకోవడానికే వాడుకుంటారనే విసయాన్ని ఈ సినిమాలో చర్చించారు. మరోవైపు ప్రేమకి సంబంధించిన సందేశం సైతం పాతదే అని, కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ విషయాల్లో మేకర్స్ సక్సెస్‌ అయినట్టే. పాటలు సినిమాకి మరో ప్లస్‌. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పాటలు చాలా బాగున్నాయి. పెద్ద సినిమా రేంజ్‌లో ఉండటం దీనికి కలిసొచ్చే అంశం. 
 

నటీనటులుః 

శివ కందుకూరి లవర్‌ బాయ్‌గా కనిపించే తను ఇందులో మాస్‌ లుక్‌లో కనిపించాడు. లవర్‌ బాయ్‌ నుంచి మాస్‌ హీరోగా షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఫేస్‌లో ఆ సీరియస్‌ నెస్‌ కూడా ఆకట్టుకుంది. కానీ డాన్సుల్లో మాత్రం మెప్పించలేకపోయాడు. కానీ నటుడిగా మంచి మార్కులు వేసుకున్నారు. మేఘా ఆకాష్‌.. జెన్నీ ఫాత్రలో బాగా చేసింది. సెటిల్డ్ గా నటించింది. అలాగే మరో లవర్‌గా ప్రగతి శ్రీవాత్సవ్‌ పాత్ర హైలైట్‌ అవుతుంది. రుద్రగా ధనంజయ్‌ మెప్పించాడు. రెండు షేడ్స్ లో అదరగొట్టాడు. సుహాస్‌ మరోసారి హీరో ఫ్రెండ్‌గా అదరగొట్టారు. మధుసూదన్‌ పాత్ర సైతం అలరిస్తుంది. 

టెక్నిషియన్లుః
సంగీతం సినిమాకి బ్యాక్‌ బోన్‌. గోపీచంద్‌ పెద్ద సినిమాల రేంజ్‌లోనే పాటల, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. రాహుల్‌ శ్రీవాత్సవ్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, రిచ్‌ లుక్‌నిస్తున్నాయి. బడ్జెట్‌ పరంగా చిన్న సినిమా అయినా చూస్తుంటే భారీ బడ్జెట్‌ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. కెమెరా యాంగిల్స్ సైతం బాగున్నాయి. సినిమాకి కెమెరా వర్క్ మెయిన్‌ హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. రాహుల్‌ శ్రీవాత్సవ్‌కి మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. ఎడిటింగ్‌ పెద్ద మైనస్‌ సినిమాలో చాలా అనవసరమైన సీన్లున్నాయి. ఓ అరగంట సీన్లు కట్‌ చేస్తే మరింత క్రిస్పీగా ఉంటుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చాలా రిచ్‌గా నిర్మించారు. దర్శకుడు భరత్‌ పెదగాని.. కంటెంట్‌ పరంగా మంచి ప్రయత్నమని చెప్పాలి. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో పూర్థి స్థాయిలో సక్సెస్‌ కాలేదు. సీన్లు బాగా లాగడం, పదేపదే చూపించడం, అనవసరమైన సీన్లు చూపించడంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. దీంతో ఆడియెన్స్ ఫోకస్‌ డైవర్ట్ అవుతుంది. ఆడియెన్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యారు. వారికి ఇంకా అరటిపండు వలిచి పెట్టాల్సిన పనిలేదు. కానీ ఇందులో దర్శకుడు అదే చేశాడు. ఆ విషయాల్లో కేర్‌ తీసుకుంటే ఫలితం బాగుండేది. 

రేటింగ్‌ః 2.5

నటీనటులు : శివ కందుకూరి, ధనుంజయ్, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాత్సవ్, ప్రియా వడ్లమాని, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, హర్షితా చౌదరి, మధునందన్ తదితరులు.
ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్! 
సంగీతం : గోపీసుందర్ 
నిర్మాత : ఎన్. శ్రీనివాస రెడ్డి 
రచన, దర్శకత్వం : భరత్ పెదగాని 

click me!