ఎపిసోడ్ ప్రారంభంలో మురారిని నిద్రపుచ్చటానికి నానా ప్రయత్నాలు చేస్తుంది కృష్ణ. అన్ని మర్చిపోయి ప్రశాంతంగా మీరు ఒక్కరే ఒంటరిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో దూరంగా ఎవరో వేణువుదుతూ ఉంటారు అని కబుర్లు చెప్తే ఉంటుంది కృష్ణ. నిద్రపోకుండా అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు మురారి. మీ నిద్ర ఏమో గాని నా ఓపిక పోతుంది అని విసుక్కుంటుంది కృష్ణ.