Kajal Aggarwal:మొదటిసారి తన బేబీ బంప్ రివీల్ చేసిన కాజల్... లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Published : Feb 07, 2022, 03:45 PM IST

టాలీవుడ్ స్టార్ లేడీ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్నారు. ఆమె తన టూర్ కి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ కొరకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తున్నారు. కాగా కాజల్ లేటెస్ట్ ఫొటోల్లో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి కాబోతున్న కాజల్ లుక్ ప్రత్యేకంగా ఉంది.

PREV
16
Kajal Aggarwal:మొదటిసారి తన బేబీ బంప్ రివీల్ చేసిన కాజల్... లేటెస్ట్ ఫోటోలు వైరల్!
kajal aggarwal,

2020 అక్టోబర్ లో వివాహం చేసుకున్న కాజల్ ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టారు . తాను తల్లికాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కాజల్ గర్భవతి అన్న విషయం తెలుసుకున్న కాజల్ అభిమానులు  సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

26
kajal aggarwal,


ఇక చందమామ గా పిలవబడే కాజల్ కి పుట్టనున్న బిడ్డ ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే దానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. షూటింగ్స్ నుండి కొంచెం విరామం దొరకడంతో దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు. భర్త కిచ్లుతో కలిసి కొన్నాళ్ళు ఆహ్లాదంగా గడపనున్నారు. 

36
kajal aggarwal,


కాజల్ అగర్వాల్  జోరు తగ్గినట్లే అనిపిస్తుంది. ఒప్పుకున్న చిత్రాలు తప్పితే కొత్తగా సైన్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఆఫర్స్ వచ్చినా రాకున్నా కాజల్ కి నష్టమేమీ లేదు. కోరుకున్న ప్రియుడ్ని పెళ్లాడిన కాజల్ హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవిస్తుంది. 

46

కాజల్ హీరోయిన్ గా నటించిన మల్టీస్టారర్ ఆచార్య (Acharya)ఏప్రిల్ 29న విడుదల కానుంది.-చిరంజీవి చరణ్ నటిస్తున్న ఈ మూవీలో ఆమె చిరుకు జంటగా నటించారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆచార్యలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు.

56


ఇక హిందీలో ఒక చిత్రంతో పాటు, తమిళంలో మూడు చిత్రాల వరకూ నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో అధిక చిత్రాలు చేసిన కాజల్... హిందీలో కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. సౌత్ లో లాంగ్ కెరీర్ కలిగిన హీరోయిన్స్ లో ఒకరిగా కాజల్ నిలిచారు. 

66


పెళ్లి తర్వాత తన భర్త గౌతమ్ వ్యాపార వృద్ధికి కాజల్ తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన నడుపుతున్న సంస్థ ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. గృహిణిగా కాజల్ నెరవేరుస్తున్న బాధ్యతలు అబ్బురపరుస్తున్నాయి.   

click me!

Recommended Stories