Ennenno Janmala Bandham: యశోధర్, వేదల పెళ్లి భాజాలు.. ఇద్దరిని చూసి మాళవిక షాక్?

Navya G   | Asianet News
Published : Feb 07, 2022, 03:00 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వేద ను పెళ్లి కూతుర్ని చేసే క్రమంలో క్రమంలో శశి ఆటపట్టిస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటాడు.  

PREV
15
Ennenno Janmala Bandham: యశోధర్, వేదల పెళ్లి భాజాలు.. ఇద్దరిని చూసి మాళవిక షాక్?

ఆ తర్వాత సులోచన వాళ్ళు మాలిని వాళ్ళను కచేరీ పేరుతో ఆటపట్టించి చేతులు నొప్పి పుట్టేలా మాలిని వాళ్ళతో కచేరీ చేయిస్తారు. ఆ తర్వాత చేదుగా ఉండే కసాయం ఇచ్చి మాలిని వాళ్ళను చాలా ఇబ్బంది పెడతారు. అంతే కాకుండా ఎలా ఉన్నాయి మా మర్యాదలు అంటూ సులోచన ఆట పట్టిస్తుంది. ఆ సమయంలో వీరిరువురి మధ్య ఫన్నీ వార్ చాలా బావుంటుంది.
 

25

ఆ తర్వాత వేద ఎంతో అందం గా పూజ కార్యక్రమం దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అదే క్రమంలో అత్తమామల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని  పూజ పీటల పై కూర్చుంటుంది.  ఈ లోగ యశోధర్ కూడా వచ్చి వేద పక్కన కూర్చుంటాడు. ఆ క్రమంలో యశోదర్, వేదలు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు.
 

35

ఆ తర్వాత పూజారి వీరిరువురి ని అమ్మవారి  శాంతి పూజకు మీరిద్దరూ పాత్రులు అవ్వండి అని చెబుతాడు. అలా ఆనందంగా శాంతి పూజా కార్యక్రమం మొదలుపెడతారు. ఒకవైపు వసంత్ ముద్దు ఇవ్వ మని చిత్రను ఫన్నీ అడుగుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే వారిరువురు యశోధర్, వేదలు కలిసి ఉండడాన్ని చూసి  వాళ్లు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు.
 

45

ఆ తరువాత వసంత్ మళ్లీ చిత్రను ముద్దు అడుగుతాడు. ఇక చిత్ర కళ్ళు మూసుకో ముద్దు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఫన్నీగా పారిపోతుంది. మరోవైపు వేద కూడా యశోదర్ ను ఫన్నీ గా నవ్వుతూ ఆట పట్టిస్తుంది. దాంతో యశోదర్ నువ్వు ఎంత నవ్వినా.. పెళ్లయిన తర్వాత వచ్చేది నా ఇంటికే కదా అని మనసులో అనుకుంటాడు.
 

55

అలా వీరిద్దరు ఆనందంగా పూజ చేస్తూ ఉండగా ఇంతలో మాళవిక బోకే పట్టుకొని వస్తుంది. ఇక మాళవికను చూసిన వేద ఆశ్చర్యపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎలాంటి ట్విస్ట్ ఎదురావుతుందనేది వేచి చూడాల్సి ఉంది.

click me!

Recommended Stories