ప్రభాస్, చరణ్, రవితేజ ఎవ్వరికీ సాధ్యం కాలేదు..దేవర దెబ్బకి బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్, రాజమౌళి కొడుకు కామెంట్స్

First Published | Sep 27, 2024, 10:15 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్ల దగ్గర హంగామా కనిపిస్తోంది. క్రిటిక్స్ రివ్యూలు, ప్రేక్షకుల రెస్పాన్స్ మొదలైపోయింది. ఫస్ట్ హాఫ్ బావుందని, సెకండ్ హాఫ్ లో చాలా మైనస్ లు ఉన్నాయని ఆడియన్స్ అంటున్నారు. ఓవరాల్ గా ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెబుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్ల దగ్గర హంగామా కనిపిస్తోంది. క్రిటిక్స్ రివ్యూలు, ప్రేక్షకుల రెస్పాన్స్ మొదలైపోయింది. ఫస్ట్ హాఫ్ బావుందని, సెకండ్ హాఫ్ లో చాలా మైనస్ లు ఉన్నాయని ఆడియన్స్ అంటున్నారు. ఓవరాల్ గా ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెబుతున్నారు. విజువల్ గా మీప్పించే విధంగా దేవర చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే దేవర చిత్రంపై సెలెబ్రిటీల రివ్యూలు కూడా మొదలయ్యాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ దేవర చిత్రం చూసిన తర్వాత తన రెస్పాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్తికేయ దేవర చిత్రం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత.. ప్రతి హీరోకి వారి నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతూ వస్తోంది. స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. అంటే 23 ఏళ్లుగా ఈ సెంటిమెంట్ బ్రేక్ కాలేదు. 


దీని గురించి కార్తికేయ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నంబర్ 1 చిత్రం 23 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 27న ఇదే రోజు విడుదలైంది. స్టూడెంట్ నంబర్ 1 తర్వాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు చిత్రం అట్టర్ ఫ్లాప్. అక్కడి నుంచే ఈ బ్యాడ్ సెంటిమెంట్ మొదలైంది. రాజమౌళితో సినిమా చేయడం.. ఆ తర్వాత వచ్చే చిత్రం ఫ్లాప్ కావడం ఇదే జరుగుతూ వచ్చింది. 

23 ఏళ్ళ ఈ మిత్ ని ఎన్టీఆర్ స్వయంగా బ్రేక్ చేశారు అంటూ కార్తికేయ పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన ఎలాంటి అద్భుతాలు చేయగలరో తెలుసు. దేవర చిత్రం చూశాక నాకు మాటలు రావట్లేదు. ఫ్యాన్స్ అందరూ సెలెబ్రేట్ చేసుకోవడానికి ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. దేవర.. ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్ అంటూ కార్తికేయ అభివర్ణించాడు. 

కార్తికేయ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్, ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ నటించారు. వీళ్లంతా తమ తర్వాతి చిత్రాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్నవారే. ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించారు. ఫ్లాప్ సెంటిమెంట్ కొనసాగుతుందా అని ఫ్యాన్స్ టెన్షన్ లో ఉండగా.. దేవర చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Latest Videos

click me!