బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరో వీకెండ్ కి దగ్గరైంది. అంటే ఓ కంటెస్టెంట్ ఇంటిని వీడనున్నాడు. గత సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. సోనియా ఆకుల, పృథ్విరాజ్, నాగ మణికంఠ, నబీల్, ప్రేరణ నామినేషన్స్ లో లిస్ట్ లో ఉన్నారు.
ఆడియన్స్ తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే... అనూహ్యంగా నబీల్ టాప్ లో ఉన్నాడట. నబీల్ అఫ్రిది సెలబ్రిటీ కాదు. సోషల్ మీడియా స్టార్ అయినప్పటికీ బుల్లితెర ఆడియన్స్ లో పెద్దగా ఫేమ్ లేదు.
గేమ్ పరంగా పర్లేదు అనిపిస్తున్నాడు. అలాంటి నబీల్ టాప్ లో కొనసాగడం ఊహించని పరిణామం. నబీల్ తర్వాత నాగ మణికంఠకు అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. నాగ మణికంఠ మొదట్లో ట్రోల్స్ కి గురయ్యాడు. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడనే విమర్శలు వినిపించాయి.
నాగ మణికంఠ గేమ్ మెరుగవుతుంది. అతడు పాయింట్స్ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. లేడీ కంటెస్టెంట్స్ తో ప్రవర్తన విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ నాగ మణికంఠకు జనాలు ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది.
ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉందట. ప్రేరణ సీరియల్ నటి. ఈ కన్నడ భామకు పెద్దగా పాపులారిటీ లేదు. ఫిజికల్ టాస్క్ లలో కష్టపడుతుంది. ప్రేరణ గేమ్ పట్ల ప్రేక్షకుల్లో పెద్దగా నెగిటివిటీ లేదు. విష్ణుప్రియ-ప్రేరణ మధ్య గొడవలు జరిగాయి. విష్ణుప్రియను క్యారెక్టర్ లెస్ అని అనడంతో ప్రేరణ విమర్శలు ఎదుర్కొంది. విష్ణుప్రియ సైతం ప్రేరణపై ఘాటైన కామెంట్స్ చేసింది.
గత వారం విష్ణుప్రియ, ప్రేరణలకు నాగార్జున క్లాస్ పీకాడు. నాలుగో స్థానంలో పృథ్విరాజ్ ఉన్నాడట. పృథ్విరాజ్ సైతం సీరియల్ నటుడు. సోనియా-పృథ్విరాజ్ ప్రవర్తన వివాదాస్పదంగా ఉంది. ఈ విషయంలో పృథ్విరాజ్ పై కొంత నెగిటివిటీ ఉంది. అలాగే గేమ్స్ లో టెంపర్ కోల్పోతున్నాడు. గట్టిగా అరవడం మైనస్ అవుతుంది.
చివరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, సోనియా ఆకుల ఉన్నారట. ఐదవ స్థానంలో ఆదిత్య, ఆరవ స్థానంలో సోనియా ఉన్నారట. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సోనియా ఆకుల ఈ వారం ఇంటిని వీడనుంది. అయితే మనం చర్చించేది అనధికారిక పోల్స్ మాత్రమే. వివిధ మీడియా సంస్థలు నిర్వహించే పోల్స్ ఆధారంగా ఈ సమాచారం సేకరించడమైంది.
అధికారిక ఓటింగ్ స్టార్ మా బయటపెట్టదు. సోనియా ఆకుల హౌస్లో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా ఉంది. ఇద్దరు అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటూ కంటెంట్ ఇస్తుంది. కాబట్టి సోనియాను ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. చాలా సందర్భాల్లో ఆడియన్స్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ జరిగాయి.
బిగ్ బాస్ హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
కాబట్టి సోనియా సేఫ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పృథ్విరాజ్, ఆదిత్య ఓం లలో ఒకరు ఎలిమినేట్ కావచ్చనేది సోషల్ మీడియా టాక్. ఆదిత్య ఓం హౌస్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఆయన గేమ్ సాఫ్ట్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఆదిత్య ఓం కి ఈ వారం గుడ్ బై చెప్పే అవకాశం కలదు.